మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (17:30 IST)

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

Sivakarthikeyan,  Sai Pallavi
Sivakarthikeyan, Sai Pallavi
శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. 
 
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'హే రంగులే' సాంగ్ ని హీరో నితిన్ లాంచ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ జి వి ప్రకాష్ ఈ సాంగ్ ని లవ్లీ మెలోడియస్ సాంగ్ గా కంపోజర్ చేశారు. 
 
సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా తమ లైవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్  లైఫ్ జర్నీ బ్యూటీఫుల్ గా వుంది. 'హే రంగులే' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.  
 
టాప్  టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లు గా వున్నారు. 
 
ఈ మూవీ శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా రూపొందించారు. 
 
అమరన్ ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.