Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిత్యతో 'అ'లా మొదలైందంటున్న హీరో నాని

ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:27 IST)

Widgets Magazine

చూడగానే ఆకట్టుకునే ఫేస్‌తో కైపైన చూపుతో యూత్‌ని ఇట్టే ఆకర్షించే మలయాళ కుట్టి నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులముందుకు పరిచయమైంది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది. 
 
అయితే, ఇప్పుడు ఈ జోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది. నాని నిర్మాతగా మారి, తన సొంత సంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ‘అ!’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి పులికొండ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల విడుదల చేసిన నాని.. శనివారం (డిసెంబర్-2)న నిత్యామేనన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
<a class=awe movie still" class="imgCont" height="840" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-12/03/full/1512284779-4647.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ఇందులో ఆమె సింపుల్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. టైటిల్‌ ప్రకటించిన తర్వాత ‘అ!’ బృందం విడుదల చేసిన తొలి పోస్టర్‌ ఇది. ఈ సందర్భంగా నాని ‘అలా మొదలైంది నిత్‌‘అ!’తో’ అని ట్వీట్‌ చేశారు. 
 
ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నాని ఓ చేపకి, రవితేజ ఓ మొక్కకి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ఈ తరహా సినిమా ఇప్పటి వరకు తెలుగు తెరపైకి రాలేదని నాని అన్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తైనట్లు చెప్పారు. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓవర్సీస్‌లో కలెక్షన్ల కింగ్ ఎవరు?

ప్రపంచ క్యాలెండర్ చరిత్రపుటల్లో మరో యేడాది కలిసిపోనుంది. మరికొన్ని రోజుల్లో 2017వ ...

news

హీరోల చేతిలో తన్నులు తినేందుకు సిద్ధమంటున్న హీరో!

యంగ్రీ యంగ్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. డాక్టర్ రాజశేఖర్.. 'గరుడవేగ' (వేగం)తో దూసుకొచ్చి సక్సెస్ ...

news

ఎన్టీఆర్‌కు క్లాసిక్ డ్యాన్సర్, ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు మృతి

ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) తుదిశ్వాస విడిచారు. కొంతకాలం ...

news

వేదాలం రీమేక్‌లో పవన్: హాలీవుడ్ స్టోరీనే అజ్ఞాతవాసి

ఎఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ నిర్మాణ సారథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ...

Widgets Magazine