శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 మే 2021 (17:54 IST)

టెంప్ట్ చేస్తూ ఫోటో వీడియో వదిలిన శ్రీ‌రెడ్డి, అమ్మ నా బత్తాయో అంటున్న ఫ్యాన్స్

Sri reddy
శ్రీ‌రెడ్డి గురించి తెలియంది కాదు. సినిమారంగంలోని కొంద‌రిని మాట‌ల‌తో ఏకిపారేసింది. ఒక‌వైపు మాట‌ల‌తో తూట్లు పొడిచేలా మాట్లాడే ఈ భామ సోష‌ల్‌ మీడియాలో త‌ర‌చూ సంద‌డి చేస్తోంది. ఆమ‌ధ్య త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కొడుకు పైనా కామెంట్ చేసింది. ఇప్పుడు తాజాగా త‌న హాట్ హాట్ పొటోలు చూపిస్తూ యువ‌త‌ను పిచ్చెక్కిస్తుంది. ఈ పిక్స్‌నుచూసి ఆమెను త‌గినట్లుగానే ఘాటుగానూ ఫ్యాన్స్ స్పందించారు. `మా బాబూ బంగారం` సినిమాలో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వి వాడే ఊత‌ప‌దం `అమ్మ నీ బ‌త్తాయో..`అంటూ వ‌ల్లెవేస్తూ ఆమెకు త‌గ‌నివారుగా మాట్లాడ‌డం విశేషం.
 
మ‌రోవైపు గోదావ‌రి యాస‌లో అరేయ్ ఒరేయ్‌.. అంటూ ఓ పొలిటిక‌ల్ జ‌ర్న‌లిస్టుపై మాట‌ల యుద్ధం చేసింది. ఆ వీడియోను పెట్టి ఆమెలో న‌టిగా వుంద‌నిపించేలా ప‌లు హావ‌భావాలు వ్య‌క్తం చేసింది. ఎక్క‌డా బెణ‌గ‌కుండా పొలిటిక‌ల్ స‌ర్వే చేసిన‌ట్లు మాట్లాడింది. వై.ఎస్‌. జ‌గ‌న్ ఇటీవ‌లే రామ‌కృష్ణ‌రాజును అరెస్ట్ చేయ‌డంపైనా వ్యాఖ్యానించింది. జగ‌న్ ఏదైనా చేస్తే అర్థం వుంటుంది అంటూ వెన‌కేసుకువ‌చ్చింది. జ‌గ‌న్ క్రీస్టియ‌న్ అయినందుకేనా ఇలా అభాండాలు వేస్తున్నారంటూ రెచ్చిపోయింది.

ఒక ద‌శ‌లో ఆర్టిక‌ల్ 19 భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గురించి కూడా క్లాస్ పీకింది.. మ‌రి అన్నిరంగాల్లో ప‌ట్టున్న‌దానిలా మ‌ట్లాడే శ్రీ‌రెడ్డి త‌న అందాలు చూపించ‌డంలో త‌ప్పేమిలేద‌న్న‌ట్లుగా చెబుతోంది. చాలా చిత్ర‌మైన వ్య‌క్తిత్త్వం క‌దా..