మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (16:33 IST)

మహిళ కూడా నేరస్థురాలు కావొచ్చు.. పూజా భట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో చెలరేగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీనియర్ నటి పూజా భట్ స్పందించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, కంటికి కనిపించే ప్రతి వ్యక్తి లైంగిక నేరస్థుడు కాదని.. అలాగే ప్రతి మహిళ లైంగిక బాధితురాల

బాలీవుడ్ ఇండస్ట్రీలో చెలరేగిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీనియర్ నటి పూజా భట్ స్పందించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, కంటికి కనిపించే ప్రతి వ్యక్తి లైంగిక నేరస్థుడు కాదని.. అలాగే ప్రతి మహిళ లైంగిక బాధితురాలు కాబోదన్నారు.
 
హాలీవుడ్ తరహాలో బాలీవుడ్‌లో కూడా మీటూ (నేనూ బాధితురాలినే) అనే ఉద్యమం ఊపందుకోనుంది. దీనిపై పూజా భట్ స్పందిస్తూ, ఈ ప్రపంచంలో ప్రతి పురుషుడూ ఓ మనిషే, ప్రతి స్త్రీ ఓ మనిషే.. ముందు వారంతా మనుషులు. అంతేకానీ, ప్రతి మగాడు లైంగిక నేరస్థుడు కాదు, ప్రతి మహిళ లైంగిక బాధితురాలూ కాదు. ఒక్కోసారి మహిళ కూడా నేరస్థురాలు కావొచ్చు అని వ్యాఖ్యానించింది.