ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ళ్యాణ్ రామ్.. క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:40 IST)

ntramarao

స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ను డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. నంద‌మూరి న‌ట‌సింహం తండ్రి పాత్రలో నటిస్తూ.. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్రారంభ‌మైన ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వార్త ఏమిటంటే... ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ న‌టిస్తున్నాడ‌నేది ఆ వార్త సారాం‍శం. 
 
 
 
ఇంత‌కీ... క‌ళ్యాణ్ రామ్ పాత్ర ఏమిటంటే.. హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌ రామ్ పోషించ‌నున్నాడ‌ట‌. ఎన్టీఆర్‌ అధికారంలోకి రావటానికి ఎన్నికల సమయంలో చేపట్టిన చైతన్య రథం ఓ కారణం. ఆ రథాన్ని నడిపింది ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణే. దీంతో ఈ పాత్రకు కళ్యాణ్‌ రామ్‌ అయితేనే బావుంటుందన్న ఆలోచనతో ఆ నందమూరి హీరోను మేకర్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. 
 
ఇక చిత్ర లాంఛింగ్‌కు కళ్యాణ్‌ రామ్‌ హాజరుకావటం.. పైగా తన తండ్రి పాత్రే కావటంతో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నారా రోహిత్‌, తారకరత్నలకు కూడా ఈ చిత్రంలో పాత్రలు దక్కాయని ఆ కథనం వివరించింది. మే నుంచి ఎన్టీఆర్‌ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోబోతుండగా.. దసరాకు చిత్రం విడుదల కానుంది. దీనిపై మరింత చదవండి :  
ఎన్టీఆర్ బయోపిక్ చైతన్య రథం కళ్యాణ్ రామ్ బాలకృష్ణ తేజ Balakrishna Kalyanram Drive Ntr Biopic Chaitanya Radham

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరి మెహ‌బూబా ట్రైల‌ర్ రిలీజ్.. ఛార్మి షాకింగ్ రియాక్ష‌న్..? (Trailer)

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందించిన చిత్రం ...

news

'రంగ‌స్థ‌లం' చూసిన‌ ప‌వ‌న్ - 'తొలిప్రేమ' త‌ర్వాత ఇప్పుడేన‌ట‌...

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ దర్శకత్వంలో ...

news

భావన కేసు.. దిలీప్ కొత్త వాదన.. ఆ ఇద్దరు నన్ను ఇరికించారు..

మలయాళ నటీమణి కిడ్నాప్ కేసులో సినీ హీరో దిలీప్ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. భావన ...

news

అమ్మా శ్రీరెడ్డీ... ప్లీజ్ ఇల్లు ఖాళీ చేయమ్మా... నీకు దణ్ణం పెడతాను...

తెలుగు సినీ ఫిలిం అసోసియేషన్ గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు తనకు సినిమాల్లో అవకాశాలు ...