సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (22:26 IST)

జూనియర్ ఎన్టీఆర్‌- అమిత్ షా మరోసారి భేటీ అవుతున్నారా?

ntr - amit shah
గతేడాది ఆగస్టులో టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తెలంగాణలో తన ఒక్కరోజు పర్యటనలో అమిత్ షా తారక్‌ని కలుసుకుని ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలుస్తున్నారని టాక్ వస్తోంది. 
 
గతేడాది ఉప ఎన్నికలకు ముందు మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. అదేరోజు ఎన్టీఆర్‌ని కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ప్రస్తుతానికి వీరి భేటీ ఎజెండా వివరాలు వెల్లడి కానప్పటికీ ఈ భేటీపై బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దేవరలో నటిస్తున్న సంగతి తెలిసిందే.