గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

వర్షపాతం 24 శాతం.. రక్తపాతం 34 శాతం : "ఓజీ" నుంచి పవర్‌ఫుల్ డైలాగ్

og poster
'బ్రో' చిత్రంతో ప్రేక్షకులను ఆలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు "ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్" (ఓజీ)గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. కంప్లీట్ యాక్షన్ భరిత చిత్రంగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి గురువారం అప్‌డేట్ వెల్లడించారు. సెప్టెంబరు 2వ తేదీన పెను తుఫాను రానుందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‍‌ను రిలీజ్ చేసింది. ఇందులో అర్థరాత్రి సమయంలో విలన్లను ఊచకోత కోసి తన అనుచరులతో హీరో వెళుతున్న ఫోటోతో కూడిన పోస్టర్ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. 
 
పోస్టర్‌లో ఓ చోట "లొకేషన్ : చర్చిగేట్ సౌత్ బొంబాయి, టైమ్ : ఉదయం 2.18, వర్షపాతం సాంద్రత 24 సెం.మీ, రక్తపాతం 34 సెం.మీ, వాడిన ఆయుధాలు : డబుల్ బారెల్ షాట్‌గన్" అని రాసి ఉంది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. "అగ్ని తుఫాను సెప్టెంబరు 2న వస్తుంది. ఓజీ అభిమానులారా ధైర్యంగా ఉండండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సెప్టెంబరు 2 తేదీన పవన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓజీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.