నిక్ జోనస్ మాంచి రసికుడే... మాజీ లవర్ ఒలీవియా

అమెరికా సింగర్ నిక్ జోనస్‌పై గురించి ఆయన మాజీ ప్రియురాలు ఒలీవియా కల్పో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నిక్ మాంచి రసికుడేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్.. ఆయన పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నట

Olivia Culpo - priyanka
pnr| Last Updated: శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:27 IST)
అమెరికా సింగర్ నిక్ జోనస్‌పై గురించి ఆయన మాజీ ప్రియురాలు ఒలీవియా కల్పో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నిక్ మాంచి రసికుడేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదండోయ్.. ఆయన పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాతో మంచి సంసార జీవితాన్ని అనుభవించాలంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపింది.
 
గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌లకు ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. దీనిపై ఒలీవియా స్పందిస్తూ, 'నిక్‌ విషయంలో నేను సంతోషంగానే ఉన్నానని అతడికి కొత్త ప్రేమ దొరికింది. జీవితాంతం అతడు సంతోషంగా ఉంటే.. నాకన్నా ఆనందించే వాళ్లు ఎవరూ ఉండరు' అంటూ వ్యాఖ్యానించింది. 
 
అయితే ప్రియాంక కంటే ముందు నిక్‌ మరో ఇద్దరు భామలతో డేటింగ్‌ చేశాడు. వారిలో మాజీ మిస్‌ యూనివర్స్‌ ఒలీవియా కల్పో కూడా ఒకరు. 2012లో విశ్వ సుందరిగా ఎంపికైన తర్వాత ఒలీవియా బాగా బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే 2013లో నిక్ - ఒలీవియాల ప్రేమకథ మొదలైంది. రెండేళ్ల అనంతరం వీరు విడిపోయారు. కాగా ఒలీవియా ప్రస్తుతం డానీ అమెండోలా అనే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో ప్రేమలో ఉంది. దీనిపై మరింత చదవండి :