బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (19:15 IST)

సూర్యాపేటలో వరుణ్ తేజ్ భారీ కటౌట్‌

VarunTej Massive 126 ft cut-out
VarunTej Massive 126 ft cut-out
ఇటీవల హీరోల భారీ కటౌట్లు సాధారణమయ్యాయి. ఇటీవలేే ప్రభాస్ పుట్టినరోజు పురస్కరించుకుని కూకట్ పల్లిలో ఆయన అభిమానులు దాదాపు రెండువందల అడుగుల భారీ కటౌట్ ను రూపొందించి ఆయన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నేడు భారీ కటౌట్ ను నెలకొల్పారు. 
 
వివరాల్లోకి వెళితే..  వరుణ్ తేజ్ పుట్టినరోజు గుర్తుంచుకోవడానికి వీలుగా వేడుకలా ఆయన అభిమానులు శ్రమించారు. 126 అడుగుల భారీ కటౌట్‌ని ఆపరేషన్ వాలెంటైన్ టీమ్ ఇన్‌స్టాల్ చేసింది, దీనిని అతని అభిమానులు సూర్యాపేటలో భారీ స్థాయిలో ఆవిష్కరించారు. నిన్ననే తన తాజా సినిమాలోోని వందేమాతరం సాంగ్ ను కూడా అమ్రుత లో వరుణ్ తన టీమ్ తో వెళ్ళి ఆవిష్కరించారు. దేశభక్తిని ప్రేరేపించే ఈ సినిమాను సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.