సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (13:20 IST)

హార్దిక్ పాండ్యా-పరిణీతి చోప్రాలపై వ్యంగ్య పోస్టులు.. చంకలో కోలానా, పాండ్యానా?

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా గాసిప్స్‌ విన్పిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని హీరోయిన్ పరిణీతి చో

క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా-పరిణీతి చోప్రా మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తోందంటూ గత కొంతకాలంగా గాసిప్స్‌ విన్పిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని హీరోయిన్ పరిణీతి చోప్రా నెత్తీ నోరు మొత్తుకుంటున్నా.. పరిణీతితో మాట్లాడింది కూడా లేదని హార్దిక్ కూడా చెప్తున్నా.. సోషల్ మీడియాలో వీరిపై కామెంట్లు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పరిణీతి, అక్కడ పెరిగే ఓ రకం కోలా రకానికి చెందిన ఎలుగుబంటి పిల్లను చంకలో ఎత్తుకుని ఫొటో దిగి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. 
 
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. తమ ఇష్టానుసారం సెటైర్లతో కూడిన పోస్టులు పెట్టారు. పరిణీతి చంకలో ఉన్నది కోలానా? లేదా హార్దిక్ పాండ్యానా? అని ఎద్దేవా చేస్తున్నారు. పరిణీతి ముఖం కూడా కోలా ముఖంలానే ఉందని, ఇప్పటికైనా డైటింగ్ చేయడం మానేసి కొంత లావు కావాలని కూడా సూచించారు. మరి పరిణీతి, హార్దిక్ పాండ్యాలు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.