శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (14:16 IST)

పవర్ స్టార్‌తో క్రేజీ డైరెక్టర్ మూవీ... క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

రెండేళ్ళ తర్వాత విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవార తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. పైగా, రీఎంట్రీ తర్వాత ఆయన వరుస చిత్రాలపై దృష్టికేంద్రీకరించారు. ఇందులోభాగంగా, ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం పింక్‌ను రీమేక్ చేస్తున్నారు. వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుంటే, దిల్ రాజు, బోనీ కపూర్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పేరు వకీల్ సాబ్. 
 
ఈ చిత్రం తర్వాత త‌న 27వ చిత్రంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా.. 28వ చిత్రంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ఈ రెండు చిత్రాలే కాకుండా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. 
 
ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ పవన్ - సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. పవర్ స్టార్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుంద‌నే దానిపై క్లారిటీ లేదు.