Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''అజ్ఞాతవాసి'' సినిమాకెళ్లాడు.. ఫినాయిల్‌ను కూల్‌డ్రింక్ అనుకుని తాగేశాడు..

శనివారం, 13 జనవరి 2018 (11:33 IST)

Widgets Magazine
Pawan_venkatesh

''అజ్ఞాతవాసి'' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినట్లు వార్తలు వస్తున్నా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అజ్ఞాతవాసి సినిమా చూసేందుకు వ‌చ్చిన ఓ అభిమాని మృతి చెందాడ‌ు. వివరాల్లోకి వెళితే.. బ‌ళ్లారిలోని శాస‌వాస‌పురంలో ఉండే రాముకు ప‌వ‌న్ అంటే ఎన‌లేని అభిమానం.

అయితే అజ్ఞాతవాసి సినిమా విడుద‌ల నేప‌థ్యంలో త‌న స్నేహితుల‌కు పార్టీ ఇచ్చి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ త‌రువాత‌ బుధవారం రాత్రి బళ్లారిలో గంగా అనే థియేట‌ర్లో అజ్ఞాతవాసి సినిమాకు వెళ్లాడు. సినిమాకి వెళ్లిన త‌రువాత కొద్దిసేప‌టికి బాత్రూంకి వెళ్లాడు. 
 
అక్క‌డ ఒక ఫినాయిల్ క‌న‌ప‌డ‌గా అది కూల్ డ్రింక్ అనుకొని తాగేశాడు. అనంత‌రం బాత్రూంలోనే విగ‌త జీవిగా కుప్ప‌కూలిపోయాడు. అంత‌లోనే బాత్రూంకి వ‌చ్చిన ప్రేక్ష‌కులు విగ‌త‌జీవిగా ప‌డిఉన్న రామును థియేటర్ యాజమాన్యం హుటాహుటీన వీఐఎంఎస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాము ప్రాణాలు కోల్పోయాడు. కూల్‌డ్రింక్ అనుకొని ఫినాయిల్ తాగడం ఏమిటని.. పవన్ ఫ్యాన్ మృతా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అజ్ఞాతవాసి సినిమా నచ్చకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలోనూ విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లంటూ చేసుకుంటే వరంగల్ అమ్మాయినే చేసుకుంటా: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి''తో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీతాఆర్ట్స్ పతాకంపై ...

news

''అజ్ఞాత‌వాసి''లో పవన్- వెంకటేష్ స్టిల్స్ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ''అజ్ఞాతవాసి'' సినిమా వెంకీ రోల్ ...

news

మా అమ్మ నన్ను బలవంతంగా అక్కడకు లాక్కెళ్ళేది - సమంత

సమంత.. ఈ పేరు వింటేనే క్యూట్ గర్ల్.. బబ్లీ గర్ల్.. గుర్తొస్తుంది. అలాంటి సమంత వివాహమైన ...

news

త్రివిక్రమ్ మా అన్న... నటి ఖుష్బూ

ఏ వయస్సు వారైనా ఎవరినైనా ఇష్టపడవచ్చు.. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇష్టమంటే శారీరకంగా ...

Widgets Magazine