Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా హీరోలను కాదనీ ఎన్టీఆర్‌పై పొగడ్తలా?... రేణూపై పీకే ఫ్యాన్స్ ఫైర్

సోమవారం, 27 నవంబరు 2017 (16:10 IST)

Widgets Magazine
renu desai

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్‌పై పీకేతో పాటు మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం లేకపోలేదు. తెలుగు చిత్రసీమలో డాన్సుల్లో మెగా హీరోల తర్వాతే ఎవరైనా అన్నది జగమెరిగిన సత్యం. క్లిష్టతరమైన డాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ చేతులుకాళ్లు విరగ్గొట్టుకునేవారిలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ముందుంటారు. అలాగే, మిగిలిన హీరోలు కూడా డ్యాన్స్‌లో తమను తాము ప్రూవ్ చేసుకున్నారు కూడా. 
 
అయితే, రేణూ దేశాయ్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలను కాదనీ నందమూరి హీరో జూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల వర్షం గుప్పించారు. దీంతో ఆమెపై మెగా ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారట. స్టార్ ఫ్యామిలీ హీరోలను ఆమె అస్సలు పట్టించుకోవడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
 
నిజానికి గత కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ పేరు ప్రతినిత్యం వార్తల్లో వినిపిస్తోంది. తాను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని రేణూ దేశాయ్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదిలావుంటే ప్రస్తుతం ఒక డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణూ మెగా అభిమానులకు మరోసారి కోపం తెప్పించిందట. డాన్స్ షోలో జడ్జిగా ఉన్న రేణూ దేశాయ్ అందులో జూనియర్ పాటకు స్టెప్పులేసిందట. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్‎పై పొగడ్తల వర్షం కురిపించిందట. 
 
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరని, నటనలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయనేనని రేణూ దేశాయ్ అన్నట్టు తెలుస్తోంది. క్లాసికల్ డ్యాన్స్‎తో పాటు వెస్ట్రన్ డాన్స్‎‎లోనూ ఎన్టీఆర్ టైమింగ్ బాగుంటుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చిందట. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూస్తుండి పోవాలనిపిస్తుంది అంటూ తారక్‎ను ఆకాశానికి ఎత్తేసింది.
 
ఈ కామెంట్సే మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాయట. కనీసం మెగా ఫ్యామిలీ హీరోల గురించి మాట మాత్రం ప్రస్తావన తేకుండా ఎన్టీఆర్‌పై పొగడటంపై మెగా ఫ్యాన్స్ పూర్తి నిరాశకు లోనయ్యారట. మొత్తానికి పవన్ నుంచి విడిపోయిన తర్వాత కూడా రేణూ దేశాయ్‎ను అభిమానించిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు రేణూ దేశాయ్ అంటే కస్సుమంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ త్వరలోనే మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటాడు

బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం ...

news

'పద్మావతి' మంటలు : తలలునరకం కానీ ఉరి తీసుకుంటాం...

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ చిత్రానికి సెన్సార్ ...

news

రస్నా గర్ల్ అంకితకు బాబు పుట్టాడు..

అంకితకు అబ్బాయి పుట్టాడు. అసలీ అంకిత ఎవరనేగా మీ డౌట్. ఆమె ఎవరో కాదు.. అదేనండీ రస్నా ...

news

నంది అవార్డ్స్ స్టుపిడ్, నాన్సెన్స్.. పవన్‌ సినిమాల వల్ల యువత ప్రభావితం కావట్లేదు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే సినిమాల వల్ల యువత ప్రభావితం కావట్లేదని.. ఆయన చేసే సేవల ...

Widgets Magazine