Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సైరా నరసింహారెడ్డిలో పవన్ కల్యాణ్..

శనివారం, 25 నవంబరు 2017 (09:27 IST)

Widgets Magazine
chiru-pawan

మెగాస్టార్ చిరంజీవి నటించే సైరా సినిమాలో పవర్ స్టార్ పవన్ కనిపించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో చిరూ సినిమాల్లో పవన్ మెరిసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ 151వ సినిమా సైరా నరసింహా రెడ్డిలో పవన్ కనిపిస్తాడని తెలుస్తోంది. 'శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్‌లోను అన్నయ్యతో కలిసి పవన్ కల్యాణ్ సందడి చేశాడు. 
 
తాజాగా సైరాలోనూ అన్నయ్యతో కలిసి పవన్ తెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, స్టార్ హీరోతోనే ఆ పాత్ర చేయించాలని ఈ సినిమా టీమ్ భావించిందట. ఈ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఈ పాత్ర కోసం పవన్ కల్యాణ్‌ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
 
అలాగే తాజాగా సైరాలో మరో కీలక పాత్ర కోసం భోజ్‌పురి నటుడు రేసుగుర్రం విలన్ రవికిషన్‌ను ఎంపిక చేసుకున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే దిశగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డిసెంబర్ ఆరోతేదీన ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపున ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక కొనసాగుతూనే వుంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రల కోసం అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతిని తీసుకున్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతార కన్నా నాది తక్కువేం కాదంటోన్న రకుల్‌ప్రీత్ సింగ్

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ బాగా తగ్గిపోతోందంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంత ...

news

పవర్ స్టార్ అంతేమరి... చిరు సతీమణి సురేఖ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారట...

మెగా ఫ్యామిలీ. చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి స్వయంకృషి ఫలితంగా చిన్న ...

news

కేసీఆర్ అందాన్ని చూసి ఇవాంకా ట్రంప్ షాక్ అవ్వడం ఖాయం

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఇవాంకా షాక్‌ కావడం ఖాయమని వర్మ ...

news

బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష

నంది అవార్డులు ఇవ్వడంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రముఖ ...

Widgets Magazine