ఈఈబీఎఫ్‌ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న పవన్ కల్యాణ్

శనివారం, 18 నవంబరు 2017 (09:12 IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఈఈబీఎఫ్‌) గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్నారు. దీనికోసం లండన్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్ శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు. ప్ర‌స్తుతం రెండు రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన కార్యక్రమాలకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. 
 
శనివారం ప‌వ‌న్ కల్యాణ్, యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో భేటీ కానున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేయనున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ లండన్ ‌లో విద్యార్థులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
 
అంతకుముందు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక మందిరాన్ని సందర్శించారు. అక్కడ మన రాజ్యాంగ నిర్మాతకు శుక్రవారం (నవంబర్ 17) ఆయన ఘనంగా నివాళి అర్పించారు. పవన్‌తో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ స్మారక మందిరానికి వెళ్లారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్.. స్వల్ప విరామం తీసుకొని లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :  
London Global Excellence Pawan Kalyan Global Business Summit

Loading comments ...

తెలుగు సినిమా

news

నంది అవార్డుల వివాదం... మద్దినేని ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు వర్మ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు ...

news

ఆ నంది అవార్డు నాకొద్దు బాబోయ్.. బాలక్రిష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో నంది అవార్డులకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదు. హాలీవుడ్ ఆస్కార్ ...

news

ఐ ఫోన్‌తో తీసిన 'లవర్స్ క్లబ్' సినిమా... రివ్యూ

లవర్స్‌ క్లబ్‌ నటీనటులు : అనీష్‌ చంద్ర, పావని, పూర్ణి తదితరులు. టెక్నికల్‌ టీమ్‌: సంగీతం ...

news

శ్రీదేవి కూతురిని చంపేస్తారా..!

వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి తన ముద్దుల కుమార్తె జాహ్నవి కపూర్ వెండితెర అరంగేట్రం ...