శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (14:28 IST)

ఫెమినాపై జిగేల్ రాణి-రంగమ్మత్తకు ఆఫర్ల వెల్లువ

''రంగస్థలం'' తారలకు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసిన జిగేల్ రాణి పూజా హెగ్డే.. మహేష్ బాబు 25వ సినిమాలో హీరోయిన్‌గా నటించనుండగా.. తాజాగా పూజా హెగ్డే మ్యాగజైన్ తాజా సంచిక కవర్

''రంగస్థలం'' తారలకు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసిన జిగేల్ రాణి పూజా హెగ్డే.. మహేష్ బాబు 25వ సినిమాలో హీరోయిన్‌గా నటించనుండగా.. తాజాగా పూజా హెగ్డే మ్యాగజైన్ తాజా సంచిక కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. బికినీ ధరించి ఈత కొలనులో ఉన్న పూజా హెగ్డేను కవర్ పేజీ ఫొటోగా ''ఫెమినా'' ప్రచురించింది. 
 
సాక్ష్యం సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. మోడలింగ్ నుంచి సినీరంగానికి అరంగేట్రం చేసింది. ఆపై బన్నీతో చేసిన డీజే సినిమా హిట్ సాధించింది. పూజా హెగ్డే ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి, ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
 
మరోవైపు రంగస్థలం సినిమాలో 'రంగమ్మత్త' పాత్రలో అదరగొట్టిన అనసూయకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా ఈ సినిమా పట్టాలెక్కనుంది.

మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అనసూయకు ఓ కీలక పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోల్ ఆమెకు నచ్చడంతో అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.