Widgets Magazine

డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు : పూనమ్ కౌర్ కౌంటర్

సోమవారం, 29 జనవరి 2018 (11:51 IST)

poonam kaur

సినీ నటి పూనమ్ కౌర్ మరో కౌంటర్ వేసింది. డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, ఆమె ఎవరినుద్దేశించి వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ, ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.
 
"డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. పూనమ్‌ను ఉద్దేశించి కత్తి మహేష్ వ్యక్తిగత విమర్శలు కూడా చేశాడు. ఆమెకు, పవన్ కల్యాణ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ నేపథ్యంలో ఎవరి పేరునూ ప్రస్తావించకుండా పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.
 
'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు' అంటూ నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యల తరువాత ఆమెపై పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినప్పటికీ, చేసిన వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని భావిస్తూ, నిప్పులు చెరుగుతున్నారు. తనకు అండగా ఉన్న వ్యక్తిపైనే అభాండాలు వేస్తోందని, ఆమెకు ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 
 
పూనమ్ నాటకాలు ఆడుతోందని, తర్వాతి సినిమాల గురించి ట్వీట్లు వేసుకుంటే బాగుంటుంది గానీ, పేరు చెప్పకుండా ఇలా ఆరోపణలు చేస్తే తగిన శాస్తి జరిగి తీరుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక పూనమ్ టీవీ చానల్స్‌కు వెళ్లాలని సెటైర్లు వేస్తున్నారు. పబ్లిసిటీ కోసం కాంట్రవర్శీ సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె నిజమే చెప్పిందని కూడా అంటున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Counter Money Pawan Kalyan Pavan Fans Poonam Kaur Lal

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుపమకు మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజు.. మళ్లీ రామ్ సరసన?

హీరోయిన్ ''స్నేహ'' తర్వాత టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి క్రేజ్ వుంది. నటనాపరంగా ...

news

హీరోలకు అద్దం చూసేందుకే టైంలేదు.. ఇక డేటింగ్ ఏం చేస్తాను : శ్రియ

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో డేటింగ్ చేశారా? అనే అంశంపై నటి శ్రియ స్పందించారు. ...

news

లగ్జరీ కారు కొనుగోలు.. పన్ను ఎగవేత కేసు.. అమలాపాల్ అరెస్ట్

ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ అరెస్ట్ అయ్యింది. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలను సమర్పించి లగ్జరీ ...

news

'తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం' : కత్తి మహేష్ ట్వీట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ...

Widgets Magazine