దిల్‌రాజును విమ‌ర్శించే అర్హ‌త లేదు : నిర్మాత బెల్లంకొండ సురేష్

Bellamkonda Suresh
డివి| Last Updated: ఆదివారం, 17 జనవరి 2021 (16:45 IST)
Bellamkonda Suresh
నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు సాయిశ్రీ‌నివాస్ న‌టించిన సినిమా
అల్లుడు అదుర్స్". జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుద‌లైంది. అయితే ఈ సంద‌ర్భంగా నైజాంలో ఓ థియేట‌ర్‌లో అల్లుడు అదుర్స్‌ను సినిమాను తీసివేసి.. విజ‌య్ న‌టించిన `మాస్ట‌ర్‌* సినిమాను
ప్ర‌ద‌ర్శించార‌నే విష‌యంలో.. నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ దిల్‌రాజుపై.. ఓ వ్య‌క్తి విమ‌ర్శించాడు.

దీనికి బెల్లంకొండ సురేష్ స్పందిస్తూ.... అతనికి అంత అర్హత లేదని తేల్చి చెప్పారు.
శనివారం రాత్రి
హైదరాబాద్ లో ఈ చిత్రంసక్సెస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే... బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. " అల్లుడు అదుర్స్ అనిపించే రేంజ్ లో చాలా గ్రాండియర్ గా ఈ సినిమా తీసిన సుబ్రమణ్యం, రమేష్ కి థాంక్స్. విడుదలైన ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ పండగకు అందరూ ఎంజాయ్ చేస్తున్న సినిమా ఇది. అల్లుడు శీను మా అబ్బాయి మొదటి సినిమా e రేంజ్ వసూళ్లు సాధించాయో దానికి మించి ఈ మూడు రోజుల వసూళ్లు వచ్చాయి. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు హార్రర్ మిక్స్ చేసి అత్యద్భుతంగా సినిమాని తీసిన శ్రీనివాస్ కి థాంక్స్. ఆవినాష్ సూపర్బ్ సెట్స్ వేశాడు. చోటా, తమ్మిరాజు చాలా కష్టపడ్డారు. ఇక కరోనా తరువాత ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కు వస్తారా అన్న అనుమానం ఉండేది కానీ మేమున్నాం అంటూ ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు.

అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఈ రోజు ఇంత బాగా ఉందాంటే దానికి కారణం దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వాళ్ళ వల్లే.. ఈ మధ్యే దిల్ రాజు పై ఓ వ్యక్తి కామెంట్స్ చేశాడు..అతనికి అంత అర్హత లేదు..అనవసరంగా విషయం పెద్దది చేశాడు. ఈ సినిమా సక్సెస్ తరువాత మా అమ్మాయిని చేసుకో అల్లుడు అని మెసేజ్ లు వస్తున్నాయి అన్నారు.

నభానటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా నిర్మించిన చిత్రమిది.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ' సంతోష్ శ్రీనివాస్ ఎక్స్టా ర్డినరీ కథ చెప్పి ఎంతో కష్టపడి ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. నభానటేష్ గుడ్ పెర్ఫార్మర్..సూపర్బ్ గా చేసింది. అను ఇమ్మనుయెల్ క్యారెక్టర్ లో సప్ర రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దేవిశ్రీప్రసాద్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు.. ఆర్ ఆర్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. చోటా గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. సోను సూద్ లాంటి గొప్ప వ్యక్తి తో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతి, ఈ సినిమా నీ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.

చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. " మా హీరో సాయి కష్టజీవి. చాలా హార్డ్ వర్కర్. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. ఆ హార్డ్ వర్ ఈ రోజు సక్సెస్ అయింది. పట్టుదలతో మా బ్యానర్లో ఫస్ట్ సినిమా చేసిన సంతోష్ శ్రీనివాస్ కి థాంక్స్. చోటా గారు బ్యూటిఫుల్ విజువల్స్, దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. టీమ్ అందరూ బాగా సపోర్ట్ చేసి మంచి సినిమా చేశారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.

చిత్ర సమర్పకుడు గంజి రమేష్ మాట్లాడుతూ.. " అల్లుడు అదుర్స్" సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. మంచి కథతో చాలా బాగా ఈ సినిమాని తెరకెక్కించారు. మా హీరో సాయి డాన్సులు, ఫైట్స్, కామెడీ బాగా చేశాడు అన్నారు.
Bellamkonda Suresh
Bellamkonda Suresh

చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "కథపై నమ్మకంతో భారీగా ఖర్చుపెట్టి సినిమా తీసి.. మా సినిమా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ తో ధైర్యంగా ఉన్న సుబ్రమణ్యం, రమేష్ గారికి నా థాంక్స్. ఆ నమ్మకం నిజం అయింది. చోటా గారు లేకపోతే ఈ సినిమా లేదు. అదుర్స్ అనిపించే రేంజ్ లో విజువల్స్ ఇచ్చారు. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడి వర్క్ చేశారు.

ఈ సినిమాకి ప్రాణం సంగీతం. దేవి మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. ఆర్ఆర్‌ఆర్‌తో సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు. సినిమా అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే సినిమా.. పండక్కి ప్రతి ఇంటికి అల్లుడు నీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.దీనిపై మరింత చదవండి :