శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:26 IST)

అర్జున్ రెడ్డితో పూరీ జగన్నాథ్ సినిమా? వర్కౌట్ అవుతుందా?

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలకు తర్వాత విజయ్ దేవరకొండ అగ్రీ హీరో స్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు పోటీపడుతున్నారు. యూత్‌కు బాగా నచ్చేసిన విజయ్ దేవరకొ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలకు తర్వాత విజయ్ దేవరకొండ అగ్రీ హీరో స్థాయికి ఎదిగిపోయాడు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు, దర్శకులు పోటీపడుతున్నారు. యూత్‌కు బాగా నచ్చేసిన విజయ్ దేవరకొండతో సినిమాలు చేస్తే బాగా సంపాదించవచ్చునని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.  
 
ప్రస్తుతం విజయ్ చేతిలో ఐదు సినిమాలు వున్నాయి. వాటిలో రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, మరో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. రెండు సినిమాలు స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తిచేసుకునే పనిలో వున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేలోపే ప్రాజెక్టుల కోసం దర్శకనిర్మాతలు అర్జున్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
ఎన్ని కథలున్నా.. గ్యాప్‌లో అర్జున్ రెడ్డితో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో పూరి జగన్నాథ్ వున్నట్టుగా సమాచారం. రామ్ గోపాల్ వర్మకి .. విజయ్‌కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వర్మ వైపు నుంచి విజయ్‌ని ఒప్పించే పనిలో పూరి వున్నాడని అంటున్నారు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయిందని సమాచారం. మరి అర్జున్ రెడ్డి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.