శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జులై 2016 (14:38 IST)

రజినీకాంత్ సార్‌తో క్లోజ్‌గా ఉంటే షూటింగ్‌లో ఎలాంటి టెన్షన్ ఉండదు : నటి రాధికా ఆప్టే

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ సార్‌తో క్లోజ్‌గా ఉంటే షూటింగ్‌లో ఎలాంటి టెన్షన్ ఉండదని నటి రాధికా ఆప్టే అన్నారు. వీరిద్దరు జంటగా నటించిన 'కబాలి' చిత్రం ఈనెల 22వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే.

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ సార్‌తో క్లోజ్‌గా ఉంటే షూటింగ్‌లో ఎలాంటి టెన్షన్ ఉండదని నటి రాధికా ఆప్టే అన్నారు. వీరిద్దరు జంటగా నటించిన 'కబాలి' చిత్రం ఈనెల 22వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. అలాగే, రజినీకాంత్ సినిమా అంటే ఆయన అభిమానులకే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా ఓ పండగలా ఉంటుందన్నారు. 
 
ఆమె తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'కబాలి' ఫొటో షూట్ కోసం చెన్నై వెళ్లినప్పుడు తనను చూడగానే రజినీకాంత్ సాదరంగా ఆహ్వానించారని నటి రాధికా ఆప్టే చెప్పింది. ఈ చిత్రం ఫొటో షూట్ కోసం తాను వెళ్లిన సమయంలో రజినీ సార్ రెడీ అయి ఆరుబయట ఉన్న కార్ వాన్‌లో కూర్చుని ఉన్నారని, తనను చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించారని చెప్పింది. 
 
కొద్దిసేపు తామిద్దరం మరాఠీ భాషలో మాట్లాడుకున్నామని, ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తమ సంభాషణ సాగిందని చెప్పింది. ఫొటో షూట్‌కు ముందుకు రజనీకాంత్‌తో క్లోజ్‌గా కొంచెం సేపు మాట్లాడటం తనకు చాలా ప్లస్ అయిందని, ఎలాంటి టెన్షన్ లేకుండా ఫొటో షూట్‌లో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చింది. రజనీసార్ కనుక అంత ఫ్రీగా మాట్లాడకపోతే మాత్రం తాను ఎంపిక అయి ఉండేదాన్ని కాదన్నారు.