శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (13:20 IST)

రాధిక నా భర్తని కొట్టింది అంటున్న సీనియర్ హీరోయిన్

తెలుగు, తమిళం, మలయాళంతోపాటు కన్నడలో కూడా నటించి మంచి కథానాయికగా పేరు తెచ్చుకున్న ఒకప్పటి అందాల తార నళిని తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తోటి నటి రాధికని గురించి ప్రస్తావించడం జరిగింది. 
 
పన్నెండేళ్లకే సినీ పరిశ్రమకి వచ్చాననీ, ప్రేమ సాగరం హిట్ సాధించిన తర్వాత, విఠలాచార్య దర్శకత్వం వహించిన 'కనకదుర్గ వ్రత మహాత్మ్యం' సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ నుండి అలాగే వెళ్లి, లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాననీ చెప్పుకొచ్చిన నళిని ఆ తర్వాత తనకూ.. తన భర్తకూ మధ్య మనస్పర్థలు తలెత్తి.. విడిపోవాలనే నిర్ణయానికి వచ్చిన సందర్భంలో... రాధిక నేరుగా వెళ్లి తన భర్తని కొట్టిందని చెప్పుకొచ్చింది. 'నళిని  గురించి నీకేం తెలుసు .. ఆమె చిన్నపిల్లతో సమానం. వెళ్లిపోతే వెళ్లిపో.. నళినీని ఆమె పిల్లలను నేను చూసుకుంటాను. వాళ్లను నేను పోషిస్తాను' అంటూ మా ఆయనతో గట్టిగా చెప్పేసి వచ్చింది.
 
చిత్ర పరిశ్రమలో తనకున్న ఆత్మీయులలో రాధిక ఒకరనీ... తామిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించామనీ... తన కష్ట నష్టాల్లో రాధిక తనకు అండగా నిలిచిందనీ... అలా నన్ను అర్థం చేసుకునే ఆత్మీయురాలు దొరకడం తన అదృష్టమని నళిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.