గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (11:22 IST)

271 రైతు కుటుంబాలకు రాఘవ లారెన్స్ అండ... ఒక్కో ఫ్యామిలీకి రూ.3 లక్షలు చొప్పున...

ప్రకృతి ప్రకోపం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ముందుకు వచ్చారు. ఇప్పటికే ఓ రైతు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం కూడా చేశాడు.

ప్రకృతి ప్రకోపం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ముందుకు వచ్చారు. ఇప్పటికే ఓ రైతు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం కూడా చేశాడు. అలాగే, తమిళనాడు వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న 271 మంది రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకునేందుకు నడుంబిగిస్తున్నాడు. 
 
కొరియోగ్రాఫర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన లారెన్స్... తన నటనతోనే కాకుండా సామాజిక సేవలతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆనందాన్ని పంచుకోవడమే కాదు బాధ వస్తే తన బాధ్యతను కూడా గుర్తుంచుకొని ముందుకెళ్ళే వ్యక్తే లారెన్స్. ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన లారెన్స్ ఇటీవల జరిగిన జల్లికట్టు ఉద్యమంలో తన అభిమానులకు మద్దతుగా నిలిచాడు. పేదల కోసం అనేక విరాళాలు ఇచ్చాడు. ఇక తాజాగా రైతులు కుటుంబాల కోసం నిధి సేకరించేందుకు సిద్ధమయ్యాడు. 
 
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబం లారెన్స్‌ని ఆశ్రయించగా, వారి ఆవేదనను విని వెంటనే రూ.3 లక్షలు ఇచ్చి పంపారు. అలాగే, తమిళనాడులో ఇప్పటివరకు 271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకు విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి దాని ద్వారా వచ్చిన నిధిని ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలుగా ఇవ్వాలని భావిస్తున్నట్టు లారెన్స్ తెలిపారు.