గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (11:15 IST)

వెండితెర ఇంద్రజాలికుడికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

తెలుగు చిత్రపరిశ్రమలో వెండితెర ఇంద్రజాలికుడిగా పేరుగాంచిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. తెలుగు సినిమాల్లో వచ్చే ఎన్నో పాటలను సినీ ప్రేక్షకుడు చూస్తుంటారు. కానీ, కానీ కె.రాఘవేంద్రరావు ఆలోచనల నుంచి పురుడు

తెలుగు చిత్రపరిశ్రమలో వెండితెర ఇంద్రజాలికుడిగా పేరుగాంచిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. తెలుగు సినిమాల్లో వచ్చే ఎన్నో పాటలను సినీ ప్రేక్షకుడు చూస్తుంటారు. కానీ, కానీ కె.రాఘవేంద్రరావు ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న పాటల్ని తెరపై చూస్తున్నప్పుడు కలిగే అనుభూతే వేరు.
 
అలాగని ఆయన్ని కేవలం పాటలతోనే సరిపెట్టలేం. అన్ని రకాల కథల్ని స్పృశిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెరపై ఇంద్రజాలం చేస్తుంటారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014కిగాను ఎన్టీఆర్‌ పురస్కారాన్ని ప్రకటించింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, "నా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన సినిమాతోనే నా కెరీర్‌ మలుపుతిరిగింది. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం నాకు రావడంతో ఎంతో ఆనందంగా ఉంది" అని ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు.