ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (14:12 IST)

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

rajtarun lavanya
టాలీవుడ్ హీరో రాజ్‌‌తరుణ్‌‌తో ఆమె ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని చెప్పారు. 11 యేళ్లుగా తనతో సహజీవనం చేసి, ఇపుడు మోసం చేశారని చెప్పారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
"మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం.. వేరే హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు. 11 యేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. నన్ను సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు.. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి.. నాకు దూరంగా ఉంటున్నాడు. 
 
రాజ్‌ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని నన్ను బెదిరిస్తున్నారు. గతంలో తనను డ్రగ్స్‌ కేసులో తనను కావాలనే ఇరికించారు. అరెస్టయిన 45 రోజులు జైలులో ఉన్నా కూడా రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదు అని ఆరోపించారు.