Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజమౌళి రెండో సినిమా మహేష్ బాబుతోనేనట.. మరి తొలి సినిమా.. ఎన్టీఆర్ తోనా డౌటే?

హైదరాబాద్, గురువారం, 29 జూన్ 2017 (06:20 IST)

Widgets Magazine
ss rajamouli

బాహుబలి2 అఖండ విజయం తర్వాత రెండు నెలలుగా విరామం తీసుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి మెల్లమెల్లగా తదుపరి సినిమా కోసం కథలను పరిశీలిస్తున్నాడని వినికిడి. కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నటించే హీరోపై రాజమౌళి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఆ తర్వాత చేయబోయే సినిమాలో నటించే హీరోపై మాత్రం ఖచ్చితమైన క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. 
 
'బాహుబలి' సిరీస్ ఘన విజయం తర్వాత రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ఏమిటి ఏ హీరోతో జక్కన్న సినిమా చేయబోతున్నాడు అనే ప్రశ్నలు ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వొశ్చన్స్‌గా మిగిలిపోయాయి. తాజాగా మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా ఉంటుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఇక ఇదే విషయాన్ని.. రానా 'నెంబర్ వన్ యారి' షోలో తేల్చి చెప్పేశాడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తానని.. అది నిర్మాణంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపాడు జక్కన్న. అయితే.. ఆ ప్రాజెక్ట్‌కు ఇంకా టైమ్ పట్టొచ్చంటూ ఓ చిన్న మెలిక పెట్టాడు.
 
కె.ఎల్. నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబుతో రూపొందించే చిత్రం కంటే ముందుగా.. నిర్మాణంలో సినిమా చేస్తాడట రాజమౌళి. నిర్మాత దానయ్య చిత్రం కోసం ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాడట. ఇక ఆ కథకు ఏ హీరో సరిపోతాడో.. అతనినే ఆ ప్రాజెక్ట్‌లో తీసుకోవాలనుకుంటున్నాడట రాజమౌళి. అయితే.. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు గట్టిగా వినిపిస్తున్న పేరు మాత్రం ఎన్టీఆర్. 
 
అలాగే.. మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పేరు కూడా దానయ్య సినిమా కోసం బాగా ప్రచారంలో ఉంది. కానీ అల్లు అరవింద్ పేరు వింటేనే మండిపడుతున్న రాజమౌళి  ఎంత ఒత్తిడి పెడితే మాత్రం అల్లు అర్జున్ సినిమా చేస్తాడా అనేది సందేహమే. మొత్తంమీద.. రాజమౌళి తర్వాతి సినిమా హీరోపై నెలకొన్న సస్పెన్స్.. మరికొద్దిరోజుల్లోనే వీడుతుందేమో చూద్దాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విడిపోయాక అమలాపాల్ మరీ తెలివి మీరిపోయిందా.. ధనుష్‌కే గాలమేసిందే?

ఇష్టపడి ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్‌తో సంబంధం స్వల్పకాలానికే తెగిపోవడంతో మళ్లీ ...

news

పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలడిగిన రానా... జక్కన్న ఆన్సర్స్ అదుర్స్

ఒకవైపు ఏపీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం అభ్యర్థుల ...

news

మహేష్ కోసం బాలీవుడ్ నుంచి వచ్చేసిన బ్యూటీ స్టార్... ఎందుకు?

ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత తదుపరి చిత్రం భరత్ అను నేను కొరటాల శివ ...

news

'జయదేవ్' వేడుకలో డీజే: స‌భ్య‌స‌మాజానికి ఒక‌టే మెసేజ్ ఇవ్వాల‌నే డైలాగ్ కొట్టాడు.. ఎందుకంటే?

దాసరి నారాయణ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా "డీజే.. డీజే.." అంటూ అరుస్తూ హంగామా ...

Widgets Magazine