Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను చేసిన తప్పుకు ఆయన శిక్ష అనుభవించాడు.. ఆయన స్టార్ కాదు నా తండ్రి : హృతిక్ రోషన్

బుధవారం, 25 జనవరి 2017 (08:36 IST)

Widgets Magazine
Hrithik Roshan

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను చేసిన తప్పును ఆయనపై వేసుకుని శిక్ష అనుభవించిన గొప్ప నటుడు అంటూ కితాబిచ్చారు. 
 
హృతిక్‌ రోషన్ తన తాజా చిత్రం 'బలం' (హిందీలో కాబిల్‌) ప్రమోషన్‌లో భాగంగా కోలీవుడ్‌ మామా అల్లుళ్లలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్, ధనుష్‌ల గురించి హృతిక్‌ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. 
 
రజినీకాంత్ గురించి హృతిక్‌ ఏమన్నాడంటే.. 'రజినీసార్‌ 'కాబిల్‌' ట్రైలర్‌ చూసి నా కష్టాన్ని మెచ్చుకున్నారు. ఒక గొప్ప స్టార్‌ నుంచి ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తొలిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు నా వయసు 12 ఏళ్లు. అది కూడా సూపర్‌స్టార్‌ రజినీకాంత్ పక్కన. రజినీ సార్‌ నటించిన 'భగవాన్ దాదా' సినిమాతో నా కెరీర్‌ ప్రారంభం కావడం గౌరవంగా భావిస్తున్నా.
 
అప్పుడు సరిగ్గా నటించక రీటేక్‌లు తీసుకునేవాణ్ణి. అయితే ఆయన ఆ తప్పును తనపై వేసుకుని, తన కోసం రీటేక్‌ చేద్దామని చెప్పేవారు. నాలో ఉత్సాహం తగ్గకుండా, స్ఫూర్తినింపేందుకు నా తప్పును ఆయనపై వేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి రజినీ సార్‌. నాకు తండ్రితో సమానం. మార్గదర్శకులు, స్నేహితుడు కూడా. పిల్లలు, పెద్దలు అందర్నీ సమానంగా గౌరవించే వ్యక్తి. 
 
ఆ వయసులో ఆయన ఎంతో పెద్ద స్టారో నాకు తెలియదు. తెలిశాక ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము' అని పేర్కొన్నారు. అలాగే ధనుష్‌ గురంచి ప్రస్తావిస్తూ.. ఒక నటుడిగా ధనుష్‌ ఎంతో స్ఫూర్తినిస్తాడని, అతని నటన తనకు నచ్చుతుందన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

టాలీవుడ్‌లోనే అతి పెద్ద అబద్దాల కోరు ఈమేనట..!

బాహుబలి, బజరంగి బాయిజాన్ సినిమాల సూపర్ సక్సెస్‌తో ఆ రెండు సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ ...

news

నేను నోరు విప్పితే అక్కినేని పరువు పోతుంది: దాసరి వెల్లడించని రహస్యం

అక్కినేని నాగేశ్వరరావు తనకు ఒక సందర్భంలో ఘోరంగా అవమానించారని, ఆనాటి నుంచి తమమధ్య సంబంధాలు ...

news

మెగాస్టార్ తల్చుకుంటే దక్కిన అవకాశాలూ హుళక్కేనా?

అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయో చిత్రసీమలో ప్రతి హీరోయిన్‌కు అనుభవమే. స్టార్ హీరోల అహాలకు ...

దేశం రెండుగా విడిపోతేనే మంచిదంటున్న మంచు విష్ణు: విడిపోవలసిందేనా?

దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్లు దక్షిణాది ప్రజలను, ఉత్తరాది ప్రజలను వేరువేరుగా ...

Widgets Magazine