శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (19:49 IST)

సూపర్ స్టార్ కౌగిలిలో వాలిపోయిన హీరోయిన్

రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చాలామంది హీరోయిన్లు నటించే ఉంటారు. అందులోను అగ్రహీరోయిన్ల సరసన ఉండేవారైతే చెప్పనవసరం లేదు. అందులో ఖుష్బూ ఒకరు. ఈమె నటించిన సినిమాలకు ఏకంగా ఆలయాలనే కట్టేశారు తమిళ ప్రజలు. ఇది అందరికీ తెలిసిందే. 
 
అయితే దర్బార్ సినిమా తరువాత రజినీకాంత్ మరో సినిమాలో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఫైట్ సీన్స్‌ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్లు కూడా ముగ్గురు.
 
కీర్తి సురేష్, మీనా, ఖుష్బూలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మీనా, ఖుష్బూలతో కలిసి ఇప్పటికే ఎన్నో సినిమాల్లో రజినీకాంత్ నటించారు. అయితే ప్రస్తుత ఫైటింగ్ సీన్లలో ఖుష్బూ కూడా ఉన్నారట. దీంతో షూటింగ్‌కు రాగానే ఆమెను కౌగిలించుకున్నారట రజినీకాంత్.
 
ఖుష్బూ కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా రజినీ కౌగిలిలో వాలిపోయిందట. షూటింగ్ ఏమైనా జరుగుతోందేమోనని అక్కడున్న వారందరూ ముందుగా అనుకున్నారట. కానీ రజినీ ఒక ఆప్యాయతతో ఆమెను కౌగిలించుకున్నట్లు కొద్దిసేపటి తరువాత అక్కడున్న వారికి అర్థమైందట. సినిమాల్లో ఇదంతా మామూలే కదా. అయితే తనతో పాటు నటించే హీరోయిన్లందరితోను రజినీ ఒక స్నేహభావంతో ఉంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి విమర్సలు లేకుండా ఉన్న హీరోలలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరన్నది అందరికీ తెలిసిందే.