బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (08:44 IST)

నేనేంటో.. నా శక్తి ఏమిటో తెలుసుకునేందుకే ఆధ్యాత్మిక బాట : రజనీకాంత్

త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన శక్తి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకే ఆధ్యాత్మిక బాటపట్టినట్టు తెలిపారు.

త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన శక్తి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకే ఆధ్యాత్మిక బాటపట్టినట్టు తెలిపారు. 
 
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని దయానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ, నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే నేను ఆధ్యాత్మిక బాట పట్టాను. మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమేనన్నారు. తాను ఆ ప్రయత్నంలోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. 
 
తానింకా పూర్తి స్థాయి రాజకీయవేత్తను కాలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కనీసం రాజకీయ పార్టీ పేరును కూడా ప్రకటించలేదని ఆయన గుర్తుచేశారు. ఆశ్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్న ఆయన, ఈ ఆశ్రమానికి రావడం ఇదే తొలిసారి కాదని, గతంలో చాలా సార్లు తానీ ఆశ్రమానికి వచ్చానని తెలిపారు.