శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

మా ఆయన వస్తే అంతా మంచే జరుగుతుంది : లతా రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఆయన భార్య లతా రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, ఆయన రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందని,

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఆయన భార్య లతా రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని, ఆయన రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందని, ఖచ్చితంగా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు. 
 
శ్రీ దయా ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ఆమె నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో లతా రజనీకాంత్‌ మాట్లాడుతూ, రజనీ రాజకీయాల్లోకి రావడంపై ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. 
 
రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్‌ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని, ఈ విషయంపై ఆయనే త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. ఒకవేళ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా మంచి చేస్తారని, అందుకోసం ఆయన మనసులో 100కుపైగా పథకాలు ఉండవచ్చొని అభిప్రాయపడ్డారు.