Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రామ్‌చరణ్, ఉపాసన కులు-మనాలి ట్రిప్.. మిస్టర్. సి. రైడ్ చూశారా? (ఫోటో)

మంగళవారం, 31 అక్టోబరు 2017 (09:45 IST)

Widgets Magazine

ధృవ సినిమాతో కెరీర్లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్‌‌ను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ హిట్‌పై కన్నేశాడు. ప్రయోగాత్మకంగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం1985 అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంత నటిస్తుండగా.. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న రామ్‌చ‌ర‌ణ్‌ తన భార్య ఉపాస‌నతో కలిసి ట్రిప్పేశాడు. ఇప్పటికే జంటకు సామాజిక మాధ్య‌మాల్లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌, ఎఫ్‌బి‌లో ఫిట్‌నెస్ వీడియోల‌తో టిప్స్ చెబుతూ ఉపాస‌న ఫ్యాన్స్‌ని అలెర్ట్ చేస్తుంటారు. ఇక చ‌ర‌ణ్‌తో క‌లిసి తాను ఆన్ లొకేష‌న్ వెళ్లిన‌ప్ప‌టి ఫోటోల్ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నారు. 
 
తాజాగా అలాంటి ఫోటోనే ట్విట్టర్లో ఉపాసన షేర్ చేశారు. ''మిస్ట‌ర్.సి రైడ్ చూశారా?" అంటూ ఉపాస‌న అదిరిపోయే ఫోటోని పోస్ట్ చేశారు. కులు-మ‌నాలి ట్రిప్‌లో మిస్ట‌ర్ రామ్ చ‌ర‌ణ్ జ‌డ‌ల‌ బ‌ర్రెపై ఇలా రైడ్ చేశారు. వాస్త‌వానికి మ‌గ‌ధీరుడిగా హార్స్ రైడింగ్ అద‌ర‌గొట్టేసిన చ‌ర‌ణ్ ఇలా జ‌డ‌ల‌బ‌ర్రెపై స‌వారీ చేయ‌డంపై నెటిజన్లు లైకులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సంక్రాతికి వస్తోన్న మాస్ మహారాజ "టచ్ చేసి చూడు''

రాజా ది గ్రేట్‌తో కలెక్షన్లు కురిపించిన రవితేజ.. ప్రస్తుతం టచ్ చేసి చూడు అంటున్నాడు. మాస్ ...

news

సాహోరే బాహుబ‌లి రేవంత్ రెడ్డి అంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఫోటో

తెలంగాణలో రాజకీయాలను హీటెక్కించి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి రేవంత్‌రెడ్డి ...

news

హీరోయిన్ మోహరీన్‌ను త్రివిక్రమ్ ప్రాధేయపడుతున్నారట...

మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ మెహరీన్ వెంటపడ్డారు. వెంటపడటం అంటే ...

news

లావణ్యా... అది చేస్తే పోయేది కదా... లేనిపోని తంటా....

అందాల రాక్షసి అంటూ తెరపైకి వచ్చిన అందగత్తె లావణ్య త్రిపాఠి. ఆమధ్య వరుస ఆఫర్లతో కవ్వించిన ...

Widgets Magazine