చిరు ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్: 25 భాషల్లో అందుబాటులోకి..
సినీ నటుడు చిరంజీవి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ట్రస్ట్ వెబ్ సైట్‌ను చిరు తనయుడు రామ్ చరణ్ లాంచ్ చేశారు. మరిన్ని ప్రాంతాలకు చిరు బ్లడ్, ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే వెబ్ సైట్ ప్రారంభించినట్లు తెలిపారు.
దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో పాటు కె.చిరంజీవి పేరుతో మరో వెబ్ సైట్‌ని చరణ్ ప్రాంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న అనుబంధం గురించి.. ఈ వెబ్ సైట్‌లో సమాచారం ఉంచామన్నారు చరణ్.
చిన్నప్పట్నించి పడిన కష్టాలు, సినిమా రంగంలో నిలదొక్కకున్న క్రమం, మెగాస్టార్ గా ఎదిగిన వైనం, ఆయన సినిమా పాటలు, సినిమా ఇండస్ట్రీలలోని వారితో అతనికున్న అనుబంధాలు, సత్సంబంధాలు... ఇలా ఎన్నో వివరాలు ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారని వివరించారు.