బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 10 మే 2018 (15:25 IST)

సివిల్స్ పరీక్షల్లో 624 ర్యాంకు.. రామ్ గోపాల్ వర్మ వల్లే వచ్చింది: అక్షయ్ కుమార్

సివిల్స్ పరీక్షల్లో 624వ ర్యాంకు సాధించిన వరంగల్ చెందిన అక్షయ్ కుమార్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వల్లే తాను సివిల్స్‌లో విజయం సాధించానని చెప్పాడు. తన జీవితంలో క

సివిల్స్ పరీక్షల్లో 624వ ర్యాంకు సాధించిన వరంగల్ చెందిన అక్షయ్ కుమార్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వల్లే తాను సివిల్స్‌లో విజయం సాధించానని చెప్పాడు. తన జీవితంలో కీలక పాత్ర పోషించింది వర్మేనని అన్నాడు.


వర్మకు తాను వీరాభిమానిని అని.. వర్మకు సంబంధించిన ఓ వీడియోను వదిలిపెట్టనని.. చెప్పాలంటే సివిల్స్‌ పరీక్షకు ఒక్క రోజు ముందు కూడా వర్మకు సంబంధించిన ఓ వీడియోను చూశాను. త్వరలో ఆయన్ని కలవాలనుకుంటున్నాను. కానీ నేను ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన్ని కలుస్తాను. ఎందుకంటే ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉంటే నన్ను పట్టించుకోరనే భయం... అంటూ అక్షయ్ కుమార్ చెప్పారు. 
 
తనను వర్మ పట్టించుకోకపోతే.. భరించలేనని.. లాజికల్‌గా ఎలా మాట్లాడాలన్నది వర్మ నుంచే నేర్చుకున్నాను. ప్రపంచంలోని అందరి తత్వవేత్తల గురించి వర్మ చదివారు. కాబట్టి తాను వర్మను చదివితే సరిపోతుందని అనుకుంటున్నానని.. తద్వారా అన్నీ పనులు సులభంగా పూర్తవుతాయన్నాడు. వర్మ తెరకెక్కించిన ''సత్య'' సినిమా చాలా సార్లు చూశాను. నేరాలకు సంబంధించిన సినిమాలు తీయడంలో వర్మది విభిన్న శైలి. తన గ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు స్నేహితులను కూడా వర్మ అభిమానులుగా మార్చేశానని తెలిపాడు. 
 
ఈ ఇంటర్వ్యూను వీక్షించిన వర్మ సంతోషాన్ని అవధుల్లేకుండా పోయాయి. అక్షయ్‌కు తనపై ఉన్న అభిమానానికి ముగ్దుడైన వర్మ ట్విట్టర్‌ ద్వారా అక్షయ్ కుమార్ వీడియోను పోస్టు చేశాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో సివిల్స్‌ పరీక్షల్లో రెండు సార్లు విఫలమయ్యాను. అలాంటి తాను ఓ టాపర్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు గర్వంగా వుందన్నాడు. 
 
నేరస్థులకు, ఆకతాయికలకు మాత్రమే తాను స్ఫూర్తిదాయకం అని అనుకునేవారికి ఇది గుణపాఠం అవుతుందని వర్మ వ్యాఖ్యానించాడు. అక్షయ్‌ను త్వరలో కలిసి.. చదువు గురించి చర్చించాలనుకుంటున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.