బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (10:36 IST)

నా రొమ్ము నేను గుద్దుకున్నాను.. ఇంకెవరి రొమ్ము గుద్దలేదు.. ఆర్జీవీ

ఇండస్ట్రీ‌లో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దాడంటూ అల్లు చేసిన ఆరోపణలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. నా రొమ్ము నేను గుద్దుకున్నాను కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదని కౌంటరిచ్చాడు.

ఇండస్ట్రీ‌లో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దాడంటూ అల్లు చేసిన ఆరోపణలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. నా రొమ్ము నేను గుద్దుకున్నాను కానీ ఇంకెవరి రొమ్ము గుద్దలేదని కౌంటరిచ్చాడు. అలాగే పవర్‌స్టార్‌ పవన్‌తో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఆయన సారీ చెప్పారు. తాను చేసిన పనికి క్షమించరాని నేరమంటూ వ్యాఖ్యానించారు.
 
"అరవింద్‌గారు మీ మీద నాకు చాలా గౌరవముంది.. ఎప్పటికీ ఉంటుంది కూడా. నూటికి నూరుశాతం నేను చేసింది క్షమించరాని తప్పు. మళ్ళీ ఇంకొకసారి మీకు, పవన్ కళ్యాణ్‌కి మీ కుటుంబ సభ్యులకీ ఫాన్స్‌కీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా మళ్ళీ ఎప్పుడూ పవన్ మీద కానీ, మీ మిగతా కుటుంబ సభ్యులమీద కానీ నెగటివ్ కామెంట్స్ పెట్టనని మా మదర్ మీద, నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నాను అని అన్నాడు. 
 
పవన్ స్థాయి తగ్గిచడానికి నీ వెనుక ఎవరున్నారన్న అరవింద్ ప్రశ్నకు సమాధానమిచ్చాడు ఆర్జీవీ. పవన్ ఒక ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్.. అతని స్థాయి తగ్గించడానికి ఆఫ్‌ట్రాల్ నేనెవరిని? మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం నా స్వభావం తప్ప నా వెనుక ఎవరూ కానీ, ఏ పార్టీ లేదని స్పష్టంచేశారు.