మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (09:55 IST)

రామ్‌చరణ్‌కు హెచ్‌.సి.ఎ. అవార్డు దక్కి ఎన్‌.టి.ఆర్‌.కు ఎందుకు దక్కలేదు తెలుసా?

NTR (tw)
NTR (tw)
ఇటీవల తెలుగు సినిమా రంగంలో జరిగిన పరిణామాలు మరలా రెండు వర్గాలుగా మాట్లాడుకునే స్థితికి చేరాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో నాటునాటు సాంగ్‌ ఆస్కార్‌ నామినీకి వెళ్ళడం ఒక గొప్ప విషయం అయితే, ఆ తర్వాత రామ్‌చరణ్‌కు ఉత్తమ నటుడిగా క్రిటిక్  అవార్డు దక్కడం, గ్లోబల్‌ అవార్డు దక్కడంపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దానికితోడు పవన్‌ కళ్యాణ్‌తోపాటు పలువురు హీరోలు చరణ్‌ను అభినందిస్తూ పోస్ట్‌లు పెట్డడం అనుమానాలకు ఊతం ఇచ్చినట్లయింది. ఎన్‌.టి.ఆర్‌.ను ఎందుకు పిలవలేదు. మా ఎన్‌.టి.ఆర్‌. అర్హుడుకాదా అంటూ కొందరు తెగ గోలగోల చేస్తున్నారు. పైగా ఎన్‌.టి.ఆర్‌. ఫొటోకు సంకెళ్లు వేసి కొందరు ట్వీట్ చేశారు. 
 
ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఆరంభంలోనే గొడవ
ఆర్‌.ఆర్‌.ఆర్‌.సినిమా షూటింగ్‌లో వుండగానే ఎన్‌.టి.ఆర్‌. పాత్రపై విమర్శలు వచ్చాయి. ఆయనకు అన్యాయం చేశారనీ, కేవలం రామ్‌చరణ్‌ను హైలైట్‌ చేస్తున్నారని వాదన బాగా వినిపించింది. ఇక సినిమా విడుదల తర్వాత మొత్తంగా చూస్తే చరన్‌ పాత్రే హైలైట్‌గా నిలిచింది.
 
మొన్న చంద్రబోస్‌, నిన్న సెంథిల్‌ వెళ్ళారు.
మొదట్లో అవార్డు తీసుకున్నప్పుడు ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చరణ్‌లతోపాటు రాజమౌళి కుటుంబం యు.ఎస్‌.ఎ. వెళ్ళి అక్కడ గౌరవం తీసుకున్నారు. ఆ తర్వాత అసలు నాటునాటు పాట రాసింది చంద్రబోస్‌, ఆ తర్వాత గాయనీ గాయకుల పరిస్థితి ఏమిటి? అంటూ మరో వాదన వినిపించింది. ఇక ఆ తర్వాత చంద్రబోస్‌ను.. అవార్డు కమిటీ లంచ్‌లో భాగంగా ఆహ్వానిస్తే వెళ్ళారు. ఇక మొన్న కెమెరామెన్‌ సెంథిల్‌ వెళ్ళారు. రాజౌమౌళి కొడుకుగా వెళ్ళాడు. ఇవన్నీ చూస్తే ఏదో జరుగుతోంది అనే భ్రమ అందరిలోనూ కలుగుతుంది.
 
NTR usa tweet
NTR usa tweet
ఎన్‌.టి.ఆర్‌. రాకపోవడం కారణం?
ఇటీవలే తారకరత్న మరణంతో ఎన్‌.టి.ఆర్‌. తమ కుటుంబసభ్యుడిని కోల్పోయాడు కనుక కొన్ని కార్యక్రమాలు రీత్యా ఊరు దాటకూడదు. అందుకే రాలేదని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అందుకే వారు చెప్పినట్లే ఈరోజు ఎన్‌.టి.ఆర్‌. గురించి ఓ న్యూస్‌ బయటకు వచ్చింది. ఎన్‌.టి.ఆర్‌. 30 సినిమా నిర్మించే యువసుధ సంస్థ ట్వీట్‌ చేస్తూ... మార్చి 5న ఎన్‌.టి.ఆర్‌. లాస్‌ ఏంజెల్స్‌ వెళ్ళనున్నారంటూ హింట్‌ ఇచ్చింది. అది ఎందుకు ఏమిటి? అనేది త్వరలో తెలియనుంది. సో. ఆర్‌.ఆర్‌.ఆర్‌. అవార్డు విషయంలో ఇంత రాద్దాంతం అవసరం లేదని ట్రేడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.