Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హేయ్ పవన్... మీలో పవనిజం 100 శాతం వుంది... కానీ మీ ఇజంలో అది 90 శాతం లేదు...

మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:15 IST)

Widgets Magazine
ramgopal varma

రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా గమనిస్తుంటారట. ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్ అన్నా ఆయన పవనిజం అంటే చచ్చేంత ఇష్టమట. అందుకే పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకాన్ని ఆసాంతం చదివేశాడట. చదివిన తర్వాత షాక్ తిన్నాడట. అసలు పవన్ కళ్యాణేనా ఇది రాసిందీ అని. ఆ పుస్తకం తను అనుకున్నట్లు లేదట. అందుకే ఆయన ఫేస్ బుక్ వేదికగా పవన్ కళ్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. 
 
అందులో... హేయ్ పవన్, ఇజం పుస్తకం గురించి చెప్పే ముందు నేను మీ గురించి మాట్లాడాలి. జనసేన పార్టీని ప్రారంభించేటపుడు మీరు మాట్లాడిన తీరు, మీ లక్ష్యాలు అన్నీ చూస్తే నాకు చాలా ఆనందమేసింది. మీ ప్రసంగం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మీరు రాసిన ఇజం పుస్తకం లాంఛ్ అవుతుందని చెప్పినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యా. కానీ పుస్తకం చదివిన తర్వాత దానికి అంత సీన్లేదనిపించింది. దీనికి కారణం మీరు కాదనుకుంటున్నా. 
 
పుస్తకం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాజు రవితేజ్‌దేనన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మీ భావాలను అతడు ఓ స్కూలు పిల్లాడిలా అర్థం చేసుకున్నాడేమో అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకూ మిమ్మల్ని చూస్తుంటే... అది మీ భావాలకు దర్పణంగా కనిపించడంలేదు. ఇప్పటి తరానికి కావాల్సింది 100 శాతం పవనిజం. అంతే. 
 
కానీ ఇజం పుస్తకంలో అది 90 శాతం లేదు. కాబట్టి ఇకనైనా మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. చివరిగా ఓ మాట... మీ ఇజం పస్తకం నన్ను నిరాశపరిచినప్పటికీ మీ పవనిజం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఐ లైక్ ఇట్ అంటూ ముగించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం... లెజ్నోవాకు మగబిడ్డ

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో ...

news

నిద్రమాత్రలు మింగిన హీరో డాక్టర్ రాజశేఖర్... ఎందుకు?

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, ...

news

కాసుల వర్షం కురిపిస్తున్న 'జై లవ కుశ' - 'స్పైడర్'

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ...

news

సమంత మెడలో పసుపుతాడు... ఆ ఆఫర్స్ తన్నుకెళుతున్న హీరోయిన్...

సమంతకు పెళ్లయిపోయింది. పసుపు తాడుతో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి దీవెనలు ...

Widgets Magazine