శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:46 IST)

వ‌ర్మ ట్వీట్‌పై తెదేపా నాయకులు గరంగరం... ఎందుకు?

వివాద‌స్ప‌ద చిత్రాల‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేయ‌వ‌ద్దు అంటూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. వ‌ర్మ మాత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రిలీజ్ చేసేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. అయితే... టీడీపీ నాయ‌కులే త‌న చిత్రాన్ని ఏపీలో రిలీజ్ కాకుండా అడ్డుకున్నార‌ని వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందిస్తూ... టీడీపీ లీడ‌ర్స్‌ని టెన్ష‌న్ పెడుతున్నారు. 
 
ఇదిలా ఉంటే... వ‌ర్మ సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసి మ‌రోసారి టీడీపీ నాయ‌కులకు షాక్ ఇచ్చార‌ని చెప్ప‌చ్చు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... సీనియ‌ర్ ఎన్టీఆర్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర చూసిన త‌ర్వాతే ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌న్నారు. అంతేకాకుండా... టీడీపీకి నారా లోకేష్ వార‌సుడు కానే కాదు.. తారక్ మాత్ర‌మే అస‌లైన వార‌సుడు అని.. తార‌క్‌తోనే టీడీపీకి భ‌విష్య‌త్ ఉంటుంద‌న్నారు. వ‌ర్మ ట్వీట్ పైన టీడీపీ నాయ‌కులు సీరియ‌స్‌గా ఉన్నార‌ట‌. మ‌రి... టీడీపీ లీడ‌ర్స్ స్పందిస్తారేమో చూడాలి.