రానా... రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందా? అడిగింది ఎవరు?

మంగళవారం, 26 డిశెంబరు 2017 (14:10 IST)

pawan-rana

గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో ఎంతోమంది ప్రముఖులు కలిశారు. అందులో పవన్ కళ్యాణ్‌, రానా కలయిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. కేవలం సెల్ఫీతో రానా సరిపెట్టుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్‌ మాత్రం ఏకంగా రాజకీయాల్లోకి రానాను లాగేందుకు ప్రయత్నించారనే టాక్ వినబడుతోంది. పవన్ కనిపించిన వెంటనే అన్నా నమస్తే... అంటూ ఆప్యాయంగా కరచాలనం చేసిన రానా ఆ తరువాత సెల్ఫీ ప్లీజ్ అంటూ కోరాడు. దాంతో పవన్ కళ్యాణ్ అలాగే అంటూ తలూపాడు. సెల్ఫీ తీసుకున్న తరువాత రానాతో కాసేపు ముచ్చటించారు పవన్ కళ్యాణ్‌.
 
రాజకీయాలపై నీ అభిప్రాయమేంటి రానా అని అడిగారు పవన్ కళ్యాణ్‌. కొద్దిసేపు రానాకు ఏం అర్థం కాలేదు. నేను ఇప్పుడు సినిమాల్లోనే బిజీగా ఉన్నాను అన్నా. రాజకీయాల గురించి ఏమీ ఆలోచించలేదని చెప్పాడు. సరేలే.. సరదాగా అడిగానంటూ పవన్ కళ్యాణ్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి రానా రాజకీయాల్లో ఇష్టం వుందని చెబితే జనసేనలోకి రమ్మని ఆహ్వానించేవారేమోనని చెప్పుకుంటున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోయిన్‌ను అది కావాలంటూ ఒత్తిడి చేసిన యంగ్ హీరో

సినిమా ఇండస్ట్రీ అంటేనే రోజూ ఏదో ఒక విషయం పైన చర్చ జరుగుతూనే వుంటుంది. తాజాగా ఓ యంగ్ ...

news

బాపు-రమణ, కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డిలా మేము కూడా... చిరుతో సమస్యలొచ్చాయ్: అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవితో తన సంబంధం గురించి ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ...

news

ప్రభాస్‌తో నిహారిక పెళ్లి.. అల్లు అరవింద్ ఏమన్నారంటే?

టాలీవుడ్ టాప్ హీరో, బాహుబలి కథానాయకుడు ప్రభాస్ కొణిదెల వారింటి అల్లుడు కాబోతున్నాడని ...

news

తొడగొట్టిన నటుడు జీవీ.. రంగా అంటే ఏమిటో చూపిస్తాడట...

సినీ నటుడు జీవీ అలియాస్ జీవీ సుధాకర్ నాయుడు తొడగొట్టాడు. వంగవీటి రంగా అంటే ఏమిటో ...