కుమార్తె రెండో పెళ్లికి అనుమతిచ్చిన తండ్రి...(వీడియో)

గురువారం, 16 నవంబరు 2017 (15:54 IST)

karishma kapoor

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. ఈమె రెండో పెళ్లికి తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు రణ్‌ధీర్ కపూర్ పచ్చజెండా ఊపారు. ఆమె రెండో వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, పైగా, ఈ కాలంలో రెండో పెళ్లి అనేది సర్వసాధారణమేనని ఆయన స్పష్టంచేశారు. 
 
వాస్తవానికి కరిష్మా కపూర్ గత 2003లో తన చిన్ననాటి స్నేహితుడైన సంజయ్ కపూర్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, 13 ఏళ్ల కాపురంలో కలతలు రావడంతో 2016లో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటోంది. కానీ, సంజయ్ కపూర్ మాత్రం ఢిల్లీకి చెందిన మోడల్ ప్రియా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నాడు. 
 
ఇదిలావుంటే, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మా కపూర్‌లో ప్రేమ చిగురించింది. గత కొంతకాలంగా ముంబైకి చెందిన వ్యాపారవేత్త సందీప్‌ తోష్నివాల్‌‌తో కరిష్మా ప్రేమలో ఉందని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు బీ-టౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై కరిష్మా తండ్రి స్పందించారు. 
 
ఆమె రెండో వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కరిష్మా ఇంకా చిన్నదేనన్న ఆయన, తన ఆశీస్సులు ఆమెకి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. సందీప్‌ను ఆమె నిజంగా ప్రేమిస్తుందేమోనని అన్నారు. పేపర్లలో వారి ఫోటోలు చూస్తుంటానని ఆయన చెప్పారు. సందీప్‌ని వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటే దానికి తాను మద్దతిస్తానని ఆయన చెప్పారు. అయినా ఈ కాలంలో రెండో వివాహం సర్వసాధారణమేనని ఆయన చెప్పడం గమనార్హం.
 దీనిపై మరింత చదవండి :  
Blessings Randhir Kapoor Marriage Rumours Sandeep Toshniwal Karisma Kapoor B Town

Loading comments ...

తెలుగు సినిమా

news

దర్శకుల కోర్కెలు తీర్చలేక సినీ ఛాన్సులు వదిలేశానంటున్న బాలీవుడ్ నటి

సాధారణంగా చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతలతో పాటు హీరోలకు పడకసుఖం అందిస్తేనే సినీ అవకాశాలు ...

news

వీపు మీద బాహుబలి పచ్చబొట్టు (ఫోటో)

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. ...

news

లక్ష్మీస్ వీరగ్రంథం : లక్ష్మీపార్వతి పాత్రకు హీరోయిన్ ఫిక్స్

తెలుగు చిత్రపరిశ్రమలోని చిన్న దర్శకనిర్మాతల్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒకరు. ఈయన ...

news

నెట్టింట చక్కర్లు కొడుతున్న నమిత వెడ్డింగ్ కార్డ్..

దక్షిణాది హీరోయిన్ నమిత త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. ఈ నెల 24వ తేదీన నమిత- వీర్‌ల ...