Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తగ్గని ప్రేక్షకుల సందడి.. లాభాల పంట పండిస్తున్న "రంగస్థలం"

సోమవారం, 7 మే 2018 (16:23 IST)

Widgets Magazine

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఈ చిత్రం తరహాలో మరేచిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించలేదు.
 
పైగా, ఈ చిత్రం పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఉండటంతో ఒక్కసారి చూసిన ప్రేక్షకుడు సైతం మళ్లీమళ్లీ థియేటర్‌కు వచ్చేలా చేస్తోంది. కథతో పాటు.. పాటలు, కథనం, ఫైట్స్ ఇలా అన్ని విధాలుగా చిత్రం బాగుంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ కారణంగా ఈ సినిమా పంట పండిస్తూ వెళుతోంది.
 
నిజానికి ఈ చిత్రం విడుదలకు ముందే రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఆ తర్వాత ఈ సినిమా రూ.120 కోట్ల షేర్‌ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో రూ.18 కోట్లకు అమ్ముడు కాగా, 34 రోజుల్లో రూ.27 కోట్లను వసూలు చేసింది. సీడెడ్‌లో రూ.12 కోట్లకు అమ్ముడుపోగా, ఇక్కడ రూ.17 కోట్లను రాబట్టింది. 
 
ఉత్తరాంధ్రలో రూ.8 కోట్లకి పోయిన ఈ సినిమా, రూ.12.08 కోట్ల షేర్‌ను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లకి పోగా రూ.16.5 కోట్ల షేర్ వచ్చింది. ఇలా ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంటూ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్‌గా నిలిచింది. మొత్తానికి చరణ్ ఈ ఏడాది మాస్ ఆడియన్స్‌కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రంగస్థలం రామ్ చరణ్ సమంత లాభాల షేర్ Samanta Investment Gains Rangasthalam Ram Charan

Loading comments ...

తెలుగు సినిమా

news

క్యాస్టింగ్ కౌచ్‌పై ఘాటు సమంత.. పెళ్ళైంది.. పిల్లలు పుట్టినా నటిస్తూనే వుంటా..

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి క్యాస్టింగ్ ...

news

రోజా గారూ... మీరు ఎవరికీ నచ్చలేదేమో?... శ్రీరెడ్డి దారుణమైన కామెంట్

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పలువురిపై కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ...

news

బీజేపీలోకి మాధవీలత- నెటిజన్ల ఫైర్.. నా క్యారెక్ట‌ర్ పోతుందా? అంటూ ప్రశ్న

కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ రెండు రోజుల క్రితం హైదరాబాదులో పర్యటించారు. ...

news

వెంకటేష్ సరసన తమన్నా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్‌కు ఛాన్స్

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్‌ మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్లు ఖరారైయ్యారు. ...

Widgets Magazine