గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 మే 2023 (16:12 IST)

అభిమానులను క్షమాపణలు కోరిన రష్మిక మందన్నా...

Rashmika Mandanna
దక్షిణాదిలో ఓ వెలుగు వెలుగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈమె తాజాగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. సోషల్ మీడియాలో రష్మికను ఫాలో అవుతున్న వారి సంఖ్య 38 మిలియన్ల మంది ఉన్నారు. దీంతో ఆమె తన సినిమాలకు సంబంధించి, తన టూర్‌లు, ఇతర ప్రణాళికల గురించి తరచుగా అందులో వెల్లడిస్తుంటారు. పైగా, లేటెస్ట్ ఫోట్లను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. 
 
అయితే, అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఖాతాలో ఎటువంటి సమాచారాన్ని పోస్ట్ చేయలేదు. దీంతో అభిమానులు ఆమెను ట్యాగ్ చేస్తూ కామెట్స్ చేయసాగారు. ఈ నేపత్యంలో తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె ఆన్‌లైన్‌కు దూరంగా ఉండటానికి కారణాలు వివరించింది. 
 
'ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో షూటింగులో వున్నాను. అందుకే ఆన్‌లైన్‌లోకి రాలేకపోయా. అప్డ‌డేట్స్ షేర్ చేసుకోలేక పోయాను. క్షమించండి. మీ అందర్ని ఎంతో మిస్సయ్యాను. ప్రస్తుతం వర్షంలో షూటింగ్ చేస్తున్నాను. షూటింగు, ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సెట్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడడానికి వచ్చారు' అంటూ రష్మిక మందన్నా రాసుకొచ్చారు.