బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (11:16 IST)

అందాలు ఆరబోసే మాస్ పాత్రలు చేయను : కన్నడ భామ

తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళుతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. 'ఛలో' మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైనప్పటికీ.. 'గీత గోవిందం' చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు పట్టిందల్లా బంగారంగా మారిపోయింది.
 
నిర్మాతలు ఈమె కోసం క్యూకడుతున్నారు. పైగా, హీరోలు కూడా ఈమెతో కాలు కదిపేందుకు ఆసక్తి చూపడమే కాకుండా, ఆమెను బుక్ చేయాల్సిందిగా నిర్మాతలకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో రష్మికకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం "డియర్ కామ్రేడ్". విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. అలాగే, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నితిన్‌లతో కలిసి నటించనుంది. 
 
ఈ నేపథ్యంలో తన పాత్రల ఎంపికపై ఆమె స్పందిస్తూ, ఒక్కసారిగా నాకు వచ్చిన క్రేజ్‌కి ఇంకా ఎక్కువ సినిమాలు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తంచేస్తున్నారు. నిజంగానే నాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. 
 
అయితే వాటిలో హీరో పక్కన డాన్సులకే పరిమితమయ్యే పాత్రలు, అందాలు ఆరబోసే మసాలా పాత్రలే ఎక్కువగా వున్నాయి. నటనకి అవకాశం లేని అలాంటి పాత్రలను చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ తరహా పాత్రలను ఒప్పుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది.