'వేట కత్తికి మీసం పెడితే నాకు లాగే ఉంటాది'... దుమ్మురేపుతున్న "రెడ్డి ఇక్కడ సూడు" సాంగ్ (వీడియో)

aravinda sametha veera raghava
Last Updated: బుధవారం, 10 అక్టోబరు 2018 (14:56 IST)
జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రంలోని ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, 'పెనివిటి' సాంగ్ ప్రతి ఒక్కరినీ కంటతడపెట్టించింది.
 
అలాగే, ఈ చిత్రంలోని మరోపాట 'రెడ్డి ఇక్కడ చూడు'. ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఇది సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ పాట మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయించేదిగా ఉంది. 
 
'వేట కత్తికి మీసం పెడితే నాకు లాగే ఉంటాది. పూల బొత్తికి ఓణీ చుడితే నీకు మళ్లే ఉంటాది.. నువ్వు నేనూ జోడీ కడితే సీమకే సెగ పుడతాది..' అంటూ సాగిన ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులతో కేక పెట్టిస్తున్నారు. పూజా హెగ్డేతో ఎన్టీఆర్ రొమాన్స్ కూడా అదిరింది. 
 
ఈ పాట అభిమానులకి మాంచి కిక్ ఇస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. త‌మ‌న్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని దలేర్ మహందీ, అంజనా సౌమ్య పాడారు. మీరు ఈ సాంగ్‌పై ఓ లుక్కేయండి. 
 
కాగా, రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అర‌వింద స‌మేత చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఎన్టీఆర్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈషా రెబ్బా ఎన్టీఆర్ చెల్లెలిగా క‌నిపించ‌నుంద‌ి. జ‌గ‌ప‌తి బాబు అత్యంత కీలకమైన రోల్‌ను పోషించారు. 
 దీనిపై మరింత చదవండి :