జూనియర్‌తో రొమాన్స్‌కు సై అంటున్న స్టార్ హీరోయిన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ స్టార్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. ఈమెకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈమె నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమెకు సినీ అవకాశాలు రావడం

Regina Cassandra
pnr| Last Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (14:17 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ స్టార్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. ఈమెకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈమె నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమెకు సినీ అవకాశాలు రావడం లేదు. దీంతో షాపుల ఓపెనింగ్స్‌కే పరిమితమైంది.
 
ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన చిత్రం 'గూఢచారి'. ఈ చిత్రంలో అడవి శేష్ హీరోగా నటించాడు. ఒక వైపు కథా రచయితగానేకాకుండా హీరోగా కూడా అద్భుత నటన కనపరిచి ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. 
 
ఈ జూనియర్ హీరో ఇపుడు '2 స్టేట్స్' రీమేక్‌లో శివానీ రాజశేఖర్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆ తర్వాత మరొక సినిమాలో సోలో హీరోగా చేయనున్నారు. థ్రిల్లర్ జానర్లో ఉండబోతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రెజినా కసాండ్రను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఈ భామ కూడా జూనియర్ అడవి శేష్‌తో రొమాన్స్ చేసేందుకు సమ్మతించిందట. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ సంస్థ నిర్మించనుంది. అయితే, ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరింత చదవండి :