అర్జున్ రెడ్డి దర్శకుడిని చంపేయాలని ఉంది.. వర్మ.. ఎందుకు?

శుక్రవారం, 10 నవంబరు 2017 (14:40 IST)

Ramgopal varma

తెలుగు సినీపరిశ్రమలో అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. విజయ్ దేవరకొండకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డిని తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అంటూ చరిత్ర సృష్టించారు సందీప్ రెడ్డి. ఇప్పటికీ ఆ సినిమాను తలుచుకుని చాలామంది డైరెక్టర్లు బాధపడిపోతుంటారు. అందులోను హీరో శర్వానంద్ అయితే మరీ బాధపడిపోతున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాలో మొదటగా శర్వానంద్‌కు అవకాశమిస్తే అతను వద్దని తప్పుకున్నాడు. నిర్మాత, డైరెక్టర్ ఒకరే అయితే ఒత్తిడి పెరుగుతుంది. సినిమా సరిగ్గా చేయలేరు. ఆ సినిమా ఫెయిలయిపోతుంది. నేను అలాంటి సినిమాలు చేయలేనని చెప్పేశాడు.
 
ఇంకేముంది విజయ్ దేవరకొండను సెలక్ట్ చేసి ఆ సినిమాను పూర్తిచేసి సూపర్‌డూపర్ హిట్‌ను సాధించారు సందీప్ రెడ్డి. గత కొన్నిరోజుల ముందు సందీప్ రెడ్డిని ఆయన స్టూడియోలో కలిశారు రాంగోపాల్ వర్మ. సందీప్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్ళారు. సినిమా బాగా చేశావు సందీప్.. నిన్ను చూస్తే అసూయ కలుగుతోంది.. చంపేద్దామన్న కోపం కూడా ఉంది అంటూ నవ్వుతూ చెప్పాడట రాంగోపాల్ వర్మ. దీంతో సందీప్ రెడ్డితో పాటు మిగిలిన వారందరూ పగలబడి నవ్వుకున్నారట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

2018లో ప్రభాస్-అనుష్క వివాహం.. గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ కారు

బాహుబలి హీరో ప్రభాస్, ఆ సినిమా హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందని జోరుగా ప్రచారం ...

news

శరత్ బాబుతో కాదు.. వీరాతో నమిత పెళ్లి (వీడియో)

సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం సాగిస్తోందని.. ఆయన్ని నమిత వివాహం కూడా చేసుకోనుందని ...

news

భద్రాద్రి ఆలయంలో 'తారకరాముడు'

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి భద్రాద్రి సీతారాముల స్వామివారిని ...

news

నా మొదటి అకౌంట్ ఎక్కడ ఓపెన్ అయిందో తెలుసా? నిజం చెప్పిన రష్మి

'మాది వైజాగ్. సినిమాలంటే చచ్చేంత ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కుటుంబసభ్యులను కోరా. ...