Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్జున్ రెడ్డితో నటుడిగా చెప్పలేని అనుభూతి పొందాను: విజయ్ దేవరకొండ

సోమవారం, 30 అక్టోబరు 2017 (15:39 IST)

Widgets Magazine
arjun reddy

''అర్జున్ రెడ్డి'' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వ ప్రతిభ, విజయ్‌ దేవరకొండ నటన యువతను విశేషంగా ఆకట్టుకొంది. కేవలం రూ.5కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.50కోట్లకు పైగా వసూళ్లను సాధించి, 2017లో విడుదలైన టాప్‌ చిత్రాల సరసన నిలిచింది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి విశేషాల గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర అంశాలను ఓ వెబ్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. 
 
సందీప్‌రెడ్డి దర్శకత్వంలో ఒక నటుడిగా చెప్పలేని అనుభూతి పొందానని చెప్పాడు. పాత్రపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, అవసరమైన సూచనలు, మార్గనిర్దేశం అర్జున్‌రెడ్డి పాత్రలో చూశానని చెప్పుకొచ్చాడు. 
 
సృజనాత్మకంగా పనిచేయడం ఆయనవల్లే తనకు సాధ్యమైందని.. తాజాగా తాను నటిస్తున్న ఓ సూపర్‌నేచురల్‌ థ్రిల్లర్‌ చిత్ర షూటింగ్‌ పూర్తయిందని తెలిపాడు. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదన్నాడు. అలాగే నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "మహానటి"లో కీలక పాత్ర పోషిస్తున్నా. వీటితో పాటు ఇంకా నాలుగు ప్రాజెక్టులు ఒప్పుకొన్నానని.. అవన్నీ 2018, 2019ల్లో సెట్స్‌పైకి వెళ్తాయని చెప్పాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డీఎంకే సుప్రీం కరుణ మునిమనవడితో చియాన్ విక్రమ్ కూతురి పెళ్లి (ఫోటోలు)

కోలీవుడ్ స్టార్, చియాన్ విక్రమ్ కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. డీఎంకే సుప్రీమ్ ...

news

ఆ వేధింపులు నేనూ ఎదుర్కొన్నా : అనుపమా పరమేశ్వరన్

దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. ఈమె కోలీవుడ్, ...

news

శ్రీముఖి అందాలకు డైలాగులు తోడైతే.... గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ (వీడియో)

యాంకర్ కమ్ యాక్టర్‌గా మారిన శ్రీముఖి.. తాజాగా "గుడ్ బ్యాడ్ అగ్లీ'' అనే సినిమాలో ...

news

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే కదా.. సినిమాల్లోనూ అందుకే?: ఆండ్రియా

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే.. సినిమాల్లోనూ అదే చూపిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగేదే ...

Widgets Magazine