మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (15:41 IST)

ప్రియా వారియర్‌ సైగలకు రిషి కపూర్ ఫిదా.. నేనున్న రోజుల్లో ఎందుకు రాలేదు?

ప్రియా వారియర్.. సోషల్ మీడియా పుణ్యంతో రాత్రికి రాత్రే సెలెబ్రిటీ అయిపోయింది. ఆమె కనుసైగలకు, హావభావాలను ఫిదా అయిపోయిన వారి సంఖ్య అంతా ఇంతా కాదు. ప్రముఖులు ప్రియా వారియర్ హావాభావాలపై ప్రశంసలు గుప్పిస్త

ప్రియా వారియర్.. సోషల్ మీడియా పుణ్యంతో రాత్రికి రాత్రే సెలెబ్రిటీ అయిపోయింది. ఆమె కనుసైగలకు, హావభావాలను ఫిదా అయిపోయిన వారి సంఖ్య అంతా ఇంతా కాదు. ప్రముఖులు ప్రియా వారియర్ హావాభావాలపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రియా వారియర్‌ను బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషీ కపూర్ ఆకాశానికెత్తేశారు. ప్రియా వారియర్ అంతులేని స్టార్‌డమ్‌ను‌ సొంతం చేసుకుంటుందని రిషి కపూర్ ట్వీట్ చేశారు. 
 
అంతేగాకుండా.. ''నేనున్న సమయంలో నీవు ఎందుకు రాలేదు?'' అంటూ సరదాగా రిషి కపూర్ కామెంట్ చేశారు. అలాగే మై డియర్ ప్రియా.. రానున్న రోజుల్లో ఆమె ఏజ్ గ్రూప్ వారు ఆమె కోసం తహతహలాడుతారని చెప్పారు. ఎంతో అమాయకంగా కనిపించే ప్రియా వారియర్ తన ముఖంలో పలికించిన హావభావాలు అమోఘమని రిషీ కపూర్ కితాబిచ్చారు.