6 టీన్స్ సినిమాకు సీక్వెల్ గా రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్ రాబోతుంది
ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన '6 టీన్స్' సినిమాకు సీక్వెల్ గా కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో వస్తున్న సినిమా `రిస్క్- ఏ గేమ్ అఫ్ యూత్'. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ (జి కె) స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ప్రేక్షకులను మెప్పించే రాజీవ్ కనకాల,అనీష్ కురువిళ్ళ ఈ చిత్రంలో ప్రత్యేక నటన శైలితో కనిపించబోతున్నారు. యూట్యూబ్ లో సంచలం సృటించిన మనసా... చెలియా... వంటి వీడియో ఆల్బమ్స్ లో పాపులర్ అయినా సందీప్ అశ్వా హీరోగా, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్య ఠాకూర్, జోయా ఝవేరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిన్న11.11 రాత్రి ఘం 11:11నిలకు సెకండ్ సింగల్ లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ నటుడు సత్యం రాజేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ..."నా కెరీర్ బిగినింగ్ లో... ఘంటాడి కృష్ణ సాంగ్స్ అప్పుటి సి డి ల్లో రిపీట్ చేస్తూ వినేవాడిని. అంత మధురంగా ఉంటాయి అతని పాటలు. ఆయన స్వీయ దర్శకత్వం లో నిర్మించిన రిస్క్ లో సెకండ్ సాంగ్ 'ఓ హసీనా!' నా చేతుల మీదుగా విడుదల చేయించినందుకు సంతోషంగా వుంది. ఇంతకు ముందుగా విడుదల చేసిన " `రిస్క్`టీజర్, పాటలు చూసాను, చాలా బాగున్నాయి. యువతరానికి సంబందించిన కంటెంట్ లా వుంది. చూస్తుంటే తప్పనిసరిగా అందరికి నచ్చుతుందనే నమ్మకం కలుగుతుంది. ఈ చిత్రంలో మాటలు అన్నీ చాలా ఇన్ ట్రెస్టింగా.. పవర్‌ఫుల్‌గా వున్నాయి. అదే విధంగా పాటలు కూడా బాగున్నాయి. చిత్రం ప్రేక్షకుల ఆదరణతో చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు" అన్నారు.
నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ (జి కె) మాట్లాడుతూ... "మిత్రుడు ప్రముఖ నటుడు సత్యం రాజేష్ చేతులమీదుగా ఓ హసీనా! లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయడం ఆనందంగా వుంది. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రముఖ గీత రచయిత వరికుప్పల యాదగిరి స్వీయ రచనలో ఓ హసీనా! పాటను పాడటం జరిగింది. మా ఇద్దరి కాంబి లో వచ్చిన సంపంగి చిత్రంలో 'అందమైన కుందనాల బొమ్మరా!' పాట ఎంత పాపులర్ అయ్యిందో మీకు తెలిసిందే! '6 టీన్స్' సినిమాకు సీక్వెల్ గా, మర్డర్ మిస్టరీ కంటెంట్‌తో థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ నిచ్చే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. టైటిల్‌కి తగ్గట్టుగా లైఫ్ గేమ్ లో యూత్ చేసే తప్పులు, పొరపాట్లు వలన ఎలాంటి రిస్క్ లో పడతారో ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని కలిగించే కథనంతో ఈ చిత్రం ఉంటుంది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చతుందనే నమ్మకం వుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు హై లెట్ గా నిలుస్తాయి ఆడియో రంగంలో సిద్ శ్రీరామ్, ఝావేద్ అలీ, భార్గవి పిళ్ళై వంటి టాప్ సింగర్స్ తో పాటలు పాడించాము. చిత్రాన్ని క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో ఒకే సారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.