శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (12:17 IST)

ఒప్పోకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రాజమౌళి.. భలే స్టైల్‌గా..?

Rajamouli
Rajamouli
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎస్ఎస్ రాజమౌళి ఓ సెల్‌ఫోన్ యాడ్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఒప్పో సెల్ ఫోన్ ప్రకటనలో నటించడానికి డీల్ కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో విడుదలై అందరి దృష్టినీ ఆకర్షించింది. 
 
త్వరలో ఈ ప్రకటన ప్రసారం చేయనున్నట్లు టాక్. ఆర్ఆర్ఆర్‌తో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్న జక్కన్న ఇమేజ్‌ను వాడుకోవాలని యాడ్ కంపెనీలు పోటీపడుతున్నాయి. తాజాగా ఒప్పో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జక్కన్న మారారు. ఒప్పో కొత్త మోడల్ రెనో 10 సిరీస్ ఫోన్ కోసం రాజమౌళి యాడ్‌లో నటించారు. ఎప్పుడు సింపుల్ లుక్‌లో కనిపించే జక్కన్న.. ఈ యాడ్‌లో మాత్రం చాలా స్టైలిష్‌గా ఉన్నారు.
 
దీంతో ఆయన లుక్ చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం రాజమౌళి రూ.3 కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.