Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సామి-2: చియాన్ విక్రమ్ స్టైల్ అదిరింది.. ఫస్టు లుక్ వీడియో మీ కోసం..

గురువారం, 17 మే 2018 (18:11 IST)

Widgets Magazine

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్, త్రిష జంట‌గా న‌టించిన సామి సినిమా సంచలనం సృష్టించింది. బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. సామికి దర్శకత్వం వహించిన దర్శకుడు హరినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 
 
ఇక సామి-2లో బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సినిమాటో గ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి-2 కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ గురువారం సోషల్ మీడియాలో హీరోయిన్ కీర్తి సురేష్ పోస్టు చేసింది. 
 
ఈ ఫస్ట్ లుక్‌లో తిరునెల్వేలి నుంచి ఢిల్లీ కిలోమీటర్లను చూపే రాయిపై విక్రమ్ కూర్చున్నట్లు.. పక్కనే నాలుగు డాగ్స్ వుంటాయి. ఆ రాతి పై నుంచి విక్రమ్ పేల్చే తూటాలు రాకెట్లుగా మారి.. సినిమా పేరును చూపిస్తాయి. ఇంకా విక్రమ్ లుక్ సామి తరహాలోనే సామి-2లో వుంది. ఈ ఫస్ట్ లుక్ ఎలా వుందో మీరూ ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రంగమ్మత్తకు ఛాన్సులే ఛాన్సులు.. సచ్చిందిరా గొర్రె కోసం వెంకటలక్ష్మి వెయిటింగ్

''రంగస్థలం'' సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం తన కెరీర్‌ను స్మూత్‌గా ...

news

టాలీవుడ్‌లో బయోపిక్స్ జోరు.. మహానటి తరహాలో సౌందర్య మూవీ?

టాలీవుడ్‌లో బయోపిక్‌లో జోరు కొనసాగుతోంది. మహానటి హిట్ కొట్టడంతో అదే కోవలో బయోపిక్ ...

news

తేజ దర్శకత్వంలో ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌? పేరు 'కాబోయిన అల్లుడు'

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ భారీ ...

news

విదేశాల్లో వెడ్డింగ్ షాపింగ్.. త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా?

త్రిష త్వరలో పెళ్లి కూతురు కానుందా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో త్రిష ...

Widgets Magazine