Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

త్రిషను తిట్టిపోసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఎందుకంటే?

శనివారం, 18 నవంబరు 2017 (16:53 IST)

Widgets Magazine
Trisha

త్రిష సీనియర్ నటిగా మారిపోయింది. అయినా ఛాన్సులు అమ్మడుకు వెతుక్కుంటూనే వస్తున్నాయి. సీనియర్ హీరో అరవింద్ స్వామితో చదురంగవేట్టై చిత్రంలో నటించిన త్రిష ప్రస్తుతం అవకాశాల కోసం వేచి చూస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. త్రిష సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి పదిహేనేళ్ళకి పైగే అవుతుంది. ఇన్నేళ్ళలో త్రిషని దర్శకులు, నిర్మాతలు పలెత్తుమాట కూడా అనలేదు. 
 
కానీ తొలిసారి ఒక తమిళ స్టార్ ప్రొడ్యూసర్ త్రిషని పబ్లిక్‌గా తిట్టేసాడని టాక్ వస్తోంది. తాజాగా ''సామి''మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సినిమా నుంచి త్రిష బయటికి వచ్చేసిందట. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ హరితో మనస్పర్ధలు రావడంతో ఆ మూవీ నుంచి తప్పుకుందట త్రిష. అయితే తమిళంలో టాప్ ప్రొడ్యూసర్ అయిన జ్ఞానవేల్ రాజా త్రిషని పబ్లిక్‌గా ఓ ఆడియో లాంచ్ ప్రోగ్రామ్‌లో తిట్టిపోశాడట. 
 
ఇండైరక్ట్‌గా ఆ తిట్లు త్రిషకేనని సమాచారం. ఎక్కడా త్రిష పేరెత్తకుండా ఆమెను ఎత్తిచూపాడట జ్ఞానవేల్. ఓ సినిమా షూటింగ్ నుంచి హీరోయిన్ వాకౌట్ చేస్తే… చర్చల కోసం ఆమె ఉండే హోటల్‌కు వెళ్లి, పది గంటల పాటు ఆమె కోసం ఎదురుచూస్తే.. కనీసం మాట్లాడలేదని.. అలాంటి మహానుభావులు మరికొందరు కూడా  తమిళ సినీ పరిశ్రమలో ఉన్నారని, చేసే పనికి గౌరవం ఇవ్వని ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం కూడా ఉండటం చాలా బాధాకరమని త్రిషను ఏకిపారేశాడట. 
 
ఈ కామెంట్స్‌పై త్రిష గుర్రుగా వుందట. మరి జ్ఞానవేల్‌కి త్రిష ఎలా కౌంటరిస్తుందో వేచి చూడాలి. అయినా సామి-2 నుంచి త్రిష ఎందుకు వాకౌట్ చేసిందనేది ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రేణూ దేశాయ్ ఫీలైపోతోందట...

ఇంటర్వ్యూలివ్వడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికప్పుడు తెలివిగా సమాధానాలు చెప్పాలి. ...

news

చెలియా ఫ్లాప్ అవుతుందని తెలుసు.. మణిరత్నం కోసమే ఒప్పుకున్నా: కార్తీ

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, శకుని, కాష్మోరా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ...

news

అనుష్కకు అలాంటి అవకాశం భవిష్యత్తులో కూడా రాదట...

బాహుబలి-2 తరువాత అనుష్క నటించిన చిత్రం భాగమతి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ...

news

జనవరి 26 భాగమతి విడుదల..

భాగమతి విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలికి ముందే అనుష్క ఓకే చేసిన భాగమతి బిజీ షెడ్యూల్ ...

Widgets Magazine